బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో రజనీ పెద్దన్న సినిమాతో పోల్చితే తక్కువ థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాలు ఎనిమీ మరియు మంచి రోజులొచ్చాయి… వీటిలో తెలుగు స్ట్రైట్ మూవీ మంచి రోజులు వచ్చాయి ఒక్కటే ఉండగా డబ్బింగ్ మూవీ ఎనిమీ బాక్స్ ఆఫీస్ దగ్గర వీక్ గానే ఓపెనింగ్స్ ను అందు కుంటుంది. ముందుగా మంచి రోజులొచ్చాయి సినిమా విషయానికి వస్తే…
రెండు తెలుగు రాష్ట్రాలలో తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వడంతో ఇతర సినిమాల కన్నా కూడా సినిమా ఆక్యుపెన్సీ బెటర్ గా ఉంది, మార్నింగ్ అండ్ నూన్ షోల బుకింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా కొన్ని చోట్ల సినిమా కి హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి.
ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో దీపావళి పూజ వలన కొన్ని చోట్ల ఇంపాక్ట్ ఉన్నా ఓవరాల్ గా డీసెంట్ హోల్డ్ నే సినిమా క్యారీ చేసింది. మొత్తం మీద ఈ రోజు సినిమా ముందు అనుకున్నట్లే 1.6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు….
బాగుంటే తొలిరోజు 1.8 కోట్ల రేంజ్ కి వెళ్ళొచ్చు, అంతకుమించి కలెక్షన్స్ ని సాధిస్తే సినిమా బాగా ఓపెన్ అయ్యింది అని చెప్పాలి… ఇక ఎనిమీ సినిమాకి తెలుగు సినిమా కన్నా కూడా ఎక్కువ థియేటర్స్ ని ఇచ్చినా కానీ ఆక్యుపెన్సీ మట్టుకు అంతంతమాత్రమే ఉందని చెప్పాలి. చాలా కొన్ని చోట్ల మాత్రమె ఫుల్స్ అండ్ ఆక్యుపెన్సీ బాగుండగా ఈ సినిమా…
ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర 60-70 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ డీసెంట్ గా ఉంటేనే… ఒకవేళ అంతంత మాత్రం ఉంటే కలెక్షన్స్ తగ్గొచ్చు, ఇంకా ఆఫ్ లైన్ బుకింగ్స్ ఎక్కువ ఉంటే 70-80 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు. మరి ఈ రెండు సినిమాలు అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి.