భీష్మ(Bheeshma) మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టినా కూడా తర్వాత వరుస పెట్టి నిరాశ పరిచే సినిమాలతో కంబ్యాక్ ను సొంతం చేసుకోలేక పోతున్న యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) సినిమాతో కంబ్యాక్ ను సాలిడ్ గా సొంతం చేసుకుంటాడని…
అందరూ అనుకున్నారు కానీ సినిమా ఏ దశలో కూడా ఆడియన్స్ ను అలరించడంలో విఫలం అయిన సినిమా నితిన్ ఖాతాలో మరో ఫ్లాఫ్ మూవీగా నిలిచి నిరాశ పరిచింది…. కానీ సినిమా కోసం మేకర్స్ సాలిడ్ బడ్జెట్ నే పెట్టి నిర్మించారు….
ముందు సినిమాను 35 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించాలని అనుకున్నారు కానీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి పోయి వర్కింగ్ డేస్ కూడా పెరిగిపోవడంతో బడ్జెట్ పెరిగి పెరిగి ఆల్ మోస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 50 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లో సినిమా నిర్మాణం అయిందని ట్రేడ్ లో సమాచారం.
సినిమాకి ఈ బడ్జెట్ కి తగ్గట్లు థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ తో సాలిడ్ గా మేకర్స్ కి రికవరీ సొంతం అయ్యింది అని అంటున్నారు… ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని నితిన్ ఖాతాలో మరో ఫ్లాఫ్ గా నిలిచినా ఓవరాల్ గా మేకర్స్ కి టేబుల్ ప్రాఫిట్ అయితే వచ్చేలా చేసింది…కానీ కొన్న బయ్యర్స్ కి తీవ్ర నష్టాలను సొంతం అయ్యేలా చేసింది.