Home గాసిప్స్ 32 కోట్లతో 84 కోట్లు…ఇప్పుడు సీక్వెల్ బడ్జెట్ తెలిస్తే షాక్!!

32 కోట్లతో 84 కోట్లు…ఇప్పుడు సీక్వెల్ బడ్జెట్ తెలిస్తే షాక్!!

1092
0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 సంక్రాంతి రేసులో ఒక పక్క రామ్ చరణ్ వినయ విదేయ రామ మరో పక్క బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి క్రేజీ సినిమాలు ఉన్నా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని జస్ట్ యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ రివ్యూల తోనే సొంతం చేసుకుని సంక్రాంతి విన్నర్ గా దుమ్ము దుమారం చేసింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో ఏకంగా ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ కూడా చేయని రేంజ్ లో 84 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి దుమ్ము లేపగా సినిమా బడ్జెట్ 32 కోట్ల రేంజ్ లోనే ఉండగా బిజినెస్ 34 కోట్లకు పైగా జరగగా భారీ ప్రాఫిట్ ని సొంతం చేసుకుని…

టాలీవుడ్ చరిత్ర తిరగరాసింది. అలాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ మూవీ కి ఇప్పుడు సీక్వెల్ మొదలు కానుండగా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా కి గాను ఆల్ మోస్ట్ సేం టీం ఉంటుంది అంటున్నారు. వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో…

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్క బోతున్న ఎఫ్ 3 మూవీ కి గాను ఇప్పుడు బడ్జెట్ పరంగా ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని రేంజ్ లో భారీ బడ్జెట్ తో భారీ లెవల్ లో తెరకెక్కిస్తున్నారు అంటున్నారు. ఎఫ్ 2 కి 32 కోట్ల రేంజ్ లోనే బడ్జెట్ అవ్వగా ఇప్పుడు సీక్వెల్ కోసం ఏకంగా 70 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో…

స్టైలిష్ అండ్ సాలిడ్ క్వాలిటీ తో సినిమా అల్టిమేట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నట్లు టాలీవుడ్ లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరోలు ఇద్దరికీ కూడా సాలిడ్ రెమ్యునరేషన్ వెళ్ళబోతుందని సమాచారం. ఇక డిసెంబర్ లో రెగ్యులర్ జరుపుకోబోతున్న ఈ సినిమా వచ్చే సమ్మర్ రేసులో నిలిచే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here