బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3 భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చేసింది, ఆల్ మోస్ట్ 1400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మొదలు అయినా కానీ అనుకున్న రేంజ్ లో బుకింగ్స్ జరగలేదు కానీ రిలీజ్ రోజు కి వచ్చే సరికి మాత్రం….
ఆఫ్ లైన్ కౌంటర్ టికెట్ సేల్స్ చాలా ఇంప్రూవ్ అవ్వగా ఆన్ లైన్ టికెట్ సేల్స్ జోరు కొనసాగుతుంది, దాంతో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రస్తుతం మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఓవరాల్ గా….
40% టు 50% ఆక్యుపెన్సీ ఓవరాల్ గా కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రజెంట్ బుకింగ్స్ అండ్ నైట్ షోల గ్రోత్ ని ఎస్టిమేట్ చేసి చెప్పాలి అంటే సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద ఫస్ట్ డే….
10 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సాధించే ఓవరాల్ గ్రోత్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ కలెక్షన్స్ ఇంకా ఎంత ముందుకు వెళతాయో చెప్పగలం అని చెప్పాలి. మొత్తం మీద అన్నీ అనుకున్నట్లు జరిగి ఆఫ్ లైన్ లో నైట్ షోల టైం కి సినిమా మరింత జోరు చూపిస్తే…
12 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి. ఓవర్సీస్ లో కోడా పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయిన సినిమా అక్కడ మొత్తం మీద ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ విషయంలో ఎలాంటి జోరు చూపిస్తుందో అనేది ఆసక్తికరం. ఇక మొత్తం మీద డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.