బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు ఇప్పుడు రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి మరింత టైం పట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇండియా లో సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతున్న నేపధ్యం లో కొత్త సినిమాలు ఇక ఆగస్టు టైం కి సిద్ధం కావొచ్చు. ఇలాంటి టైం లో వచ్చే నెలలో రిలీజ్ ను ఇంకా అలానే ఉంచిన హాలీవుడ్ డబ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా రీసెంట్ గా…..
చైనా లో రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కడ సంచలన కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, వరల్డ్ లోనే ఫస్ట్ రిలీజ్ ను చైనా లోనే సొంతం చేసుకున్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా మొదటి రోజు అక్కడ తక్కువ షోలతోనే….
9.5 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేయగా తర్వాత రెండో రోజు 49.13 మిలియన్స్ డాలర్స్ ని వసూల్ చేసింది, ఇక మూడో రోజు 47.45 మిలియన్ డాలర్స్ ని వసూల్ చేసిన ఈ సినిమా మూడు రోజుల్లో అక్కడ ఏకంగా 106.08 మిలియన్ డాలర్స్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించగా… ఆదివారం 4 వ రోజు అక్కడ ప్రస్తుతానికి 25 మిలియన్ డాలర్స్….
మార్క్ ని క్రాస్ చేయగా ఫైనల్ లెక్క మినిమమ్ 45 మిలియన్ డాలర్స్ కి తగ్గని రేంజ్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దాంతో సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ ని అక్కడ 150 మిలియన్స్ కి పైగా డాలర్స్ తో దుమ్ము దుమారం లేపే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చెప్పాలి అంటే సినిమా…
4 రోజుల్లో ఏకంగా 1000 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని ఒక్క చైనా లోనే సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఇంకా వరల్డ్ వైడ్ రిలీజ్ ఉన్న నేపధ్యంలో సినిమా మరిన్ని అద్బుతాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించే ఛాన్స్ ఉంది… ఇక ఇండియా లో ఈ సినిమా అనుకున్న టైం కే వస్తుందా లేక పరిస్థితుల వలన పోస్ట్ పోన్ అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది…