Home న్యూస్ ఖుషి 20 కోట్లు….ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కి రేటు ఎంత పలికిందంటే!!

ఖుషి 20 కోట్లు….ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కి రేటు ఎంత పలికిందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర గీత గోవిందం(Geetha Govindam) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ అలాంటి హిట్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మళ్ళీ గీత గోవిందం డైరెక్టర్ పరశురాం డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్(Family Star Movie Business)…తో సమ్మర్ లో సందడి చేయబోతున్నాడు…

ఆల్ మోస్ట్ ఈ సమ్మర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాల్లో పెద్ద సినిమా ఇదేనని చెప్పొచ్చు… టీసర్ రిలీజ్ తర్వాత మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్న ఫ్యామిలీ స్టార్ బిజినెస్ పరంగా కూడా జోరు చూపించడం మొదలు పెట్టింది కానీ విజయ్ దేవరకొండ ప్రీవియస్ మూవీ ఖుషి(Kushi Movie 2023) తో పోల్చితే మాత్రం…

బిజినెస్ ఆఫర్స్ అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోలేదు… కోస్టల్ ఆంధ్ర ఏరియాలో ఫ్యామిలీ స్టార్ మూవీ బిజినెస్ ను కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ గా సినిమా కి 17 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం. కానీ అదే టైంలో లాస్ట్ ఇయర్ వచ్చిన ఖుషి మూవీ ఓవరాల్ గా ఇక్కడ….

20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది…. గీత గోవిందం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సేం కాంబో లో వస్తున్న సినిమా అవ్వడం, సమ్మర్ లో రిలీజ్ కానున్న బిగ్ రిలీజ్ అవ్వడంతో బిజినెస్ పరంగా ఇంకా బెటర్ రేంజ్ ను అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు కానీ ఉన్నంతలో….

ఎలక్షన్స్ సీజన్ అవ్వడంతో మరీ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా సేఫ్ జోన్ లో ఉండటానికి రీజనబుల్ బిజినెస్ నే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక మిగిలిన ఏరియాల బిజినెస్ రేంజ్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏప్రిల్ 5న ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here