బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో బిగ్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చిన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక పోయింది…. దానికి తోడూ సోషల్ మీడియాలో సినిమా మీద…
విపరీతమైన నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో రోజు రోజుకి కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది. 4వ రోజు వర్కింగ్ డే లో కూడా సినిమా భారీగా స్లో అయిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఎట్టకేలకు ఊరటనిస్తూ ఉగాది హాలిడే కలిసి వచ్చి 5వ రోజు సినిమాకి మంచి కలెక్షన్స్ సొంతం అయ్యాయి…
ఉగాది హాలిడే అడ్వాంటేజ్ తో 4వ రోజు తో పోల్చితే 5వ రోజు డబుల్ కన్నా ఎక్కువ గ్రోత్ ని ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో చూపించింది ఈ సినిమా….4వ రోజు వర్కింగ్ డే లో బుక్ మై షోలో ఆల్ మోస్ట్ 23 వేల లోపు టికెట్ సేల్స్ జరిగాయి… ఇక 5 వ రోజు ఉగాది హాలిడే అడ్వాంటేజ్ కలిసి వచ్చిన సినిమాకి…
ఆల్ మోస్ట్ 56 వేల టికెట్ సేల్స్ జరిగాయి….ఆల్ మోస్ట్ సండే రేంజ్ లో సినిమా 5వ రోజు జోరు చూపించడంతో ఇక రంజాన్ హాలిడే కూడా ఉండటంతో పాటు సెకెండ్ వీకెండ్ లో ఇలానే కష్టపడితే నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది…..ఎలాగూ నోటబుల్ పెద్ద మూవీస్ లేక పోవడంతో సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు నష్టాలను తగ్గించుకుంటుందో చూడాలి.
కానీ ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిలీజ్ వీకెండ్స్ లో ఒకటైన ఏప్రిల్ 5 వీకెండ్ లో రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీకి అనుకున్న రేంజ్ లో టాక్ వచ్చి ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రాంపెజ్ ను చూపించేది కానీ ఓ అద్బుత మైన అవకాశాన్ని ఈ సినిమా కోల్పోయింది. ఇక లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సినిమా అందుకుంటుందో చూడాలి.