Home న్యూస్ ఫ్యామిలీ స్టార్ టీసర్ రివ్యూ….విజయ్ దేవరకొండ కుమ్మేశాడుగా!!

ఫ్యామిలీ స్టార్ టీసర్ రివ్యూ….విజయ్ దేవరకొండ కుమ్మేశాడుగా!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఖుషి మూవీతో పర్వాలేదు అనిపించగా ఓవరాల్ గా అయితే హిట్ గీతని ఇంకా అందుకోలేదు, ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్(Family Star Movie) తో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమాలో…

మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…. ఓవరాల్ గా టీసర్ చూసిన తర్వాత ఫ్యామిలీ సబ్జెక్ట్ తో విజయ్ దేవరకొండ ఈ సారి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడని అనిపించింది అని చెప్పొచ్చు..

వరుస ఫ్లాఫ్స్ తర్వాత విజయ్ దేవరకొండ ఈ సినిమా తో పక్కా ఫ్యామిలీ సబ్జెక్ట్ ను ఎంచుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టేలా అనిపించే కాన్సెప్ట్ ను ఎంచుకుని, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టొరీ కొంచం కమర్షియల్ ఎలిమెంట్స్ ను అన్నీ మిక్స్ చేసి పరశురాం ఈ సినిమా తీస్తున్నాడు అని టీసర్ చూస్తె అనిపిస్తుంది…

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ….ప్రతీ ఖర్చుని లెక్క వేసుకునే హీరో….తనని ఇష్టపడే హీరోయిన్…. వీళ్ళందరినీ తట్టుకుని హీరో లైఫ్ ఎలా లీడ్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో సినిమా ఉండబోతుంది అనిపించేలా ఉన్న ఫ్యామిలీ స్టార్ గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకి మంచి కంబ్యాక్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది…

టీసర్ ఎండ్ లో మృణాల్ ఠాకూర్ ఎంట్రీ తో మరింత ఆకట్టుకున్న టీసర్ ఓవరాల్ గా సినిమా మీద ఉన్న అంచనాలను అయితే పెంచింది…అని చెప్పాలి. ఇక సినిమా కూడా ఇదే రేంజ్ లో ఆకట్టుకుంటే సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని విజయ్ దేవరకొండకి సొంతం అయ్యేలా చేయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here