Home న్యూస్ ఫ్యామిలీ స్టార్ థియేటర్స్…బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!

ఫ్యామిలీ స్టార్ థియేటర్స్…బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!

0

సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న సినిమా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్(Family Star Movie), ఈ సమ్మర్ కి రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలు అన్నీ పోస్ట్ పోన్ అవ్వడంతో ఉన్నంతలో సమ్మర్ లో రిలీజ్ కానున్న పెద్ద సినిమా ఫ్యామిలీ స్టార్ అయింది…

వరల్డ్ వైడ్ గా 43 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 44 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 700 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 1600 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది…

ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే మాత్రం హైదరాబాదులో ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ 1.3 కోట్ల మార్క్ ని అందుకోగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల రేంజ్ లోనే బుకింగ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా బిజినెస్ కి ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా తక్కువే అని చెప్పాలి…

కాగా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా కి మొదటి రోజు 6-7 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంది, మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని షో షోకి జోరు పెంచితే లెక్క 8-10 కోట్ల దాకా వెళ్ళొచ్చు కానీ దానికి సినిమా కి సాలిడ్ పాజిటివ్ టాక్ అయితే చాలా అవసరం అని చెప్పాలి ఇప్పుడు…

మొత్తం మీద బుకింగ్స్ పరంగా విజయ్ దేవరకొండ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే వీక్ ట్రెండ్ ఫ్యామిలీ స్టార్ కి ఉంది, కానీ సమ్మర్ లో ఓన్లీ బిగ్ రిలీజ్ అవ్వడంతో పాజిటివ్ టాక్ కనుక వస్తే కచ్చితంగా ఓపెనింగ్స్ రావడమే కాకుండా లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here