Home న్యూస్ ఎన్ని దెబ్బ కొడుతున్నా…..ఈ 2 బిగ్గెస్ట్ అడ్వాంటేజ్….

ఎన్ని దెబ్బ కొడుతున్నా…..ఈ 2 బిగ్గెస్ట్ అడ్వాంటేజ్….

2

     నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్ల మూడి ల కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ బాక్స్ అఫీస్ దగ్గర మంచి టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా నిరాశని మిగిలించి అంచనాలను అందుకోలేక చతికిల బడిన విషయం తెలిసిందే, ఎన్టీఆర్ పై బయట వినిపిస్తున్న వార్తాలు వేరు చూపెట్టిన నిజాలు వేరు అని, అసలు కథ చూపెట్టలేదని ఇలా ఎన్నొన్న విమర్శలు వచ్చాయి.

వాటి తో పాటు మొదటి పార్ట్ కథ స్లో గా ఉందని, లెంత్ మరీ ఎక్కువ ఉండటం తో బోర్ కొట్టింది అన్న కారణాలు కూడా గట్టిగానే వినిపించాయి. ఇవి కూడా కారణాలు అయ్యి సినిమా రిజల్ట్ పై తేడా కొట్టగా ఇప్పుడు అవే అడ్వాంటేజ్ గా మారబోతుంది రెండో పార్ట్ విషయంలో.

మొదటి పార్ట్ ఇచ్చిన షాక్ నుండి తేరుకున్న టీం, రెండో పార్ట్ లో చాలా మార్పులు చేర్పులు చేయగా సినిమా రన్ టైం ఈ సారి కేవలం 2 గంటల 8 నిమిషాలు మాత్రమే ఉండటం తో లెంత్ పరంగా సినిమా కి పెర్ఫెక్ట్ టైం ఉన్నట్లే అని అంతా అంటున్నారు.

ఇక స్క్రీన్ ప్లే పరంగా మొదటి పార్ట్ లో లాగో డీటైల్స్ తో సహా చెప్పకుండా ప్రేక్షకులకి నచ్చే అంశాలు ఎక్కువగా ఉండేలా అదిరి పోయే స్క్రీన్ ప్లే తో రెండో పార్ట్ ఉంటుందని చెప్పుకున్నారు. దాంతో సినిమా పై బయట ఎన్ని విమర్శలు వస్తున్నా కానీ ఈ రెండు సినిమాకి…

ఒకింత ప్లస్ పాయింట్స్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అడ్వాంటేజ్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఈ అడ్వాంటేజ్ ని ఎంతవరకు వాడుకుంటుందో చూడాలి.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here