ఇప్పుడు ఎన్టీఆర్ వంతు!!

0
1002

     2015 టెంపర్ రిలీజ్ నుండి వరుస గా 5 సినిమాలుగా ఒక్క అపజయం లేకుండా దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సారి రాజమౌళి అనుకున్న సమయానికే ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు.

ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుండగా సినిమా షూటింగ్ లో భాగంగా రీసెంట్ గా రామ్ చరణ్ తో లాంగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అది దాదాపు ముగియగా అదే సమయం లో ఎన్టీఆర్ రెస్ట్ తీసుకున్నాడు.

కొంత సమయం దుబాయ్ లో గడిపిన ఎన్టీఆర్ రీసెంట్ గా తిరిగి రాగా ఇప్పుడు రామ్ చరణ్ తో అయిన షెడ్యూల్ తర్వాత ఎన్టీఆర్ తో నయా షెడ్యూల్ ని మొదలు పెట్ట బోతున్నాడు రాజమౌళి. నాన్ స్టాప్ గా 22 రోజుల పాటు ఎన్టీఆర్ కి సంభందించిన సోలో సీన్స్ ని….

గురువారం నుండి చిత్రీకరించబోతున్నాడట రాజమౌళి. కాగా ఇందులో రెండు భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉండబోతున్నాయని సమాచారం. టాలీవుడ్ చరిత్రలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ లో ఒకటిగా ఇప్పటి నుండే భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా లో ఇద్దరు హీరోల పాత్రలు….

ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం, ఇప్పటికే ఇండస్ట్రీ లో ఇద్దరు రోల్స్ పునర్జన్మల నేపధ్యం లో ఉంటాయనే టాక్ గట్టిగా వినిపిస్తున్న విషయం తెలిసిందే, పాన్ ఇండియా మూవీ గా రాజమౌళి కూడా కన్ఫాం చేయడంతో టాక్ వస్తే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!