Home న్యూస్ (లక్ష్మీస్ ఎన్టీఆర్) ఇదే ఫైనల్…ఫైనల్ టాక్ ఇదే!

(లక్ష్మీస్ ఎన్టీఆర్) ఇదే ఫైనల్…ఫైనల్ టాక్ ఇదే!

0

     రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా సినిమా కి ఓవర్సీస్ ఆడియన్స్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ టాక్ లభించగా రెగ్యులర్ షోల కి కూడా ఆల్ మోస్ట్ అదే రేంజ్ టాక్ బయటికి వచ్చింది, ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ కి క్యూ కట్టడం తో ఫైనల్ టాక్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది.

ఫ్యామిలీ ఆడియన్స్ రామ్ గోపాల్ వర్మ సినిమాలకు రావడం మానేసి చాలా కాలమే అయింది, కానీ ఈ సినిమా తో చాలా కాలనికి తిరిగి ఫ్యామిలీ ఆడియన్స్ వర్మ సినిమాకి వచ్చేలా చేయగా సినిమా చూసిన చాలా మంది ఫ్యామిలీస్ రెస్పాన్స్ మాత్రం.

యావరేజ్ గానే ఉందని చెప్పాలి, రామ్ గోపాల్ వర్మ తెరకక్కించిన కథ బాగా నే ఉన్నా, టేకింగ్ విషయం లో కానీ బోర్ సీన్స్ విషయం లో కానీ ఆడియన్స్ అంత సాటిస్ ఫై గా అయితే లేరు అంటు న్నారు. ముఖ్యం గా డార్క్ థీం ఆకట్టు కోలేదని అంటున్నారు.

కానీ ఓవరాల్ గా కొన్ని లోటు పాట్లు ఉన్నా తెలియని కథ అవ్వడం తో ఒకసారి చూసే విధంగా సినిమా ఉందని వారు చెబుతున్నారు, ఇక ఆల్ మోస్ట్ రెగ్యులర్ కామన్ ఆడియన్స్ నుండి కూడా ఇదే తరహా టాక్ వినిపిస్తుండటం విశేషం అనే చెప్పాలి.

మొత్తం మీద సినిమా కి ఫైనల్ టాక్ యావరేజ్ గానే ఉందని చెప్పాలి, కానీ సమ్మర్ ఫస్ట్ రిలీజ్ అవ్వడం తో కచ్చితంగా సినిమా కి ఒక వారం వరకు డోకా ఉండదని చెప్పొచ్చు. కలెక్షన్స్ పరంగా కూడా జోరు చూపితే సినిమా రామ్ గోపాల్ వర్మ కి తెలుగు లో చాలా కాలానికి తొలి హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here