Home న్యూస్ మాస్ రచ్చ ఇది….స్టార్ కిడ్స్ ని మించిన భీభత్సం!!

మాస్ రచ్చ ఇది….స్టార్ కిడ్స్ ని మించిన భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్ కిడ్స్ లో కొందరి ఓపెనింగ్స్ ని మించేలా అలాగే కొందరి ఓపెనింగ్స్ ని డామినేట్ చేసేలా కలెక్షన్స్ ని ఓపెనింగ్స్ లో సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. టెలివిజన్ నుండి వెండితెరకి చేరుకున్న సుధీర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా నటించిన గాలోడు సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు సొంతం చేసుకుంది. కాగా సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్….

65 లక్షలకు చేరువ అయ్యే రేంజ్ లో షేర్ ని అందుకుంది, సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ ఏమి లేవు, స్టార్ట్ కాస్ట్ కూడా అంత ఏమి లేదు, అయినా కానీ టెలివిజన్ నుండి వచ్చిన సుధీర్ కి ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి.

అదే టైం లో రీసెంట్ గా రిలీజ్ అయిన స్టార్ కిడ్స్ మంచు విష్ణు జిన్నా ఫస్ట్ డే 12 లక్షల రేంజ్ షేర్ నే అందుకోగా మరో స్టార్ కిడ్ అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో ఫస్ట్ డే 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఆ సినిమా ప్రమోషన్స్ అండ్ బడ్జెట్ లెక్కలు వేరు…

అదే టైం లో గాలోడు సినిమా బడ్జెట్ అండ్ ప్రమోషన్స్ చాలా తక్కువే అయినా కానీ సినిమా స్టార్ కిడ్స్ మూవీస్ ని డామినేట్ చేసే రేంజ్ లో ఓపెన్ అవ్వడంతో సుధీర్ కి కొన్ని మంచి కాంబినేషన్ లు పడితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా మంచి ఓపెనింగ్స్ ని కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here