Home న్యూస్ గామి మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్…..క్లీన్ హిట్ టార్గెట్ ఎంతంటే!!

గామి మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్…..క్లీన్ హిట్ టార్గెట్ ఎంతంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాలలో మంచి బజ్ ను సొంతం చేసుకున్న సినిమా విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు కూడా పెద్దగా బజ్ లేదు కానీ…

ఒక్క సారి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత క్వాలిటీ, టేకింగ్ అండ్ విజువల్స్ చూసి ప్రతీ ఒక్కరూ ఇది హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉందంటూ మెచ్చుకోగా సినిమా మీద అంచనాలు ఓవర్ నైట్ లో పెరిగి పోయాయి అని చెప్పాలి. దాంతో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ కూడా మంచి జోరుని చూపించింది అని చెప్పాలి.

ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయినా కూడా క్వాలిటీ ఎక్స్ లెంట్ గా ఉండటం, ఆడియన్స్ లో బజ్ ఏర్పడటంతో బిజినెస్ పరంగా కూడా జోరు చూపించిన సినిమా వరల్డ్ వైడ్ గా 10 కోట్లకు పైగా వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి…

ఒకసారి ఓవరాల్ గా సినిమా వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
Gaami Movie WW Pre Release Business(Valued)
👉Nizam: 3.50Cr
👉Ceeded: 1.2Cr
👉Andhra: 3.50Cr
AP-TG Total:- 8.20CR
👉KA+ROI+OS – 2Cr
Total WW: 10.20CR(BREAK EVEN – 11CR~)

మొత్తం మీద సినిమా 10.2 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మినిమమ్ 11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాకి ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా కూడా ఈ బిజినెస్ ను అవలీలగా దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here