Home న్యూస్ గామి ట్రైలర్ రివ్యూ….హాలీవుడ్ రేంజ్ లో ఉంది సామి!!

గామి ట్రైలర్ రివ్యూ….హాలీవుడ్ రేంజ్ లో ఉంది సామి!!

0

యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie) ఒక్కసారిగా టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది…. సినిమా టీసర్ ఆల్ రెడీ మంచి బజ్ ను క్రియేట్ చేయగా ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఆ క్వాలిటీకి, టేకింగ్ కి…విజువల్స్ కి ప్రతీ ఒక్కరు కూడా…

ఫిదా అవుతున్నారు అనే చెప్పాలి, ఆ రేంజ్ లో మెప్పించింది గామి సినిమా ట్రైలర్…ట్రైలర్ లో సినిమా స్టొరీ పాయింట్ ను కొద్ది వరకు రివీల్ చేశారు….హీరోకి ఒక తీవ్ర సమస్య ఉంటుంది, దానికి సొల్యూషన్ హిమాలయాలలోని ద్రోణగిరి పర్వాతాలలో ఉంటుంది. దాంతో హీరో ప్రయాణం కొనసాగుతుంది. ఆ స్టొరీకి సైమల్ టేనియస్ గా ఇతర ఉపకథలు ఉంటాయి…

వీటన్నిటికీ హీరోకి ఉన్న లింక్ ఏంటి అనేది సినిమా కథ పాయింట్ గా ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది. యూనిక్ స్టోరీ పాయింట్ తో వస్తున్న గామి సినిమా ట్రైలర్ సింపుల్ గా చెప్పాలి అంటే హాలీవుడ్ లెవల్ విజువల్స్ తో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉందని చెప్పాలి. అసలు ఈ రేంజ్ క్వాలిటీని అయితే…

ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ కూడా చేయలేదు. సౌండింగ్ కూడా ఎక్స్ లెంట్ గా ఉండగా డిఫెరెంట్ రోల్ లో విశ్వక్ సేన్ ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మ్ చేశాడు అనిపించేలా ట్రైలర్ మెప్పించింది. మార్చ్ 8న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది…

ఏమాత్రం సినిమా కి టాక్ కూడా ట్రైలర్ రేంజ్ లో మెప్పిస్తే కచ్చితంగా విశ్వక్ సేన్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు… హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో మెప్పించిన గామి ట్రైలర్ సినిమా పరంగా ఎంతవరకు ఇప్పుడు అంచనాలను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here