Home న్యూస్ ఆపరేషన్ వాలెంటైన్ ప్రీమియర్స్ షో టాక్ ఏంటి….హిట్టా…ఫట్టా!!

ఆపరేషన్ వాలెంటైన్ ప్రీమియర్స్ షో టాక్ ఏంటి….హిట్టా…ఫట్టా!!

0

వరుస ఫ్లాఫ్స్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) సినిమా భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది… ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి ఎలాంటి టాక్ ఇప్పుడు సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా….

కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయలేదు కానీ…ఎయిర్ ఫోర్స్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మేజర్ పాయింట్ పుల్వామా అటాక్ మీదనే అయినా కానీ దానికన్నా ముందు ఆ తర్వాత కథ చాలానే ఉందని అంటున్నారు, మెయిన్ పుల్వామా అటాక్ సినిమా స్టార్ట్ అయిన చాలా సేపటికి అవుతుందని… ఈ గ్యాప్ లో హీరో ఎలివేషన్లు…

Operation Valentine Movie Premiere Show Review and Talk
ఇతర సీన్స్ తో సినిమా ఉంటుందని అంటున్నారు. మరీ భారీ బడ్జెట్ తో కాక పోయినా ఉన్న బడ్జెట్ లో గ్రాండియర్ చాలా వరకు టీం మెయిన్ టైన్ చేసినా కూడా కొన్ని చోట్ల గ్రాఫిక్స్ నాసిరకంగానే ఉన్నాయని అంటున్నారు… సీరియస్ స్టోరీ అయిన ఆపరేషన్ వాలంటైన్ ఫస్టాఫ్ వరకు పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా…

సెకెండ్ ఆఫ్ కథ డ్రాగ్ అవుతూ ఉంటుందని అంటున్నారు, సెకెండ్ ఆఫ్ ను మరింత శ్రద్ధ పెట్టి తీసి ఉంటే ఇంకా బాగుండేదని అన్న టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద సినిమా మొత్తం చూసిన తర్వాత యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో ఉంది అనిపించేలా టాక్ అయితే వినిపిస్తుంది అని చెప్పాలి ఇప్పుడు….

ఇలాంటి ఎయిర్ ఫోర్స్ నేపధ్యంలో మూవీస్ మన ఆడియన్స్ కి చాలా వరకు కొత్తది కాబట్టి ఇలాంటి టాక్ ఎక్స్ పెర్ట్ చేయడం సహజమే అని చెప్పాలి. అందునా రీసెంట్ గా ఆల్ మోస్ట్ సేమ్ పాయింట్ తో ఫైటర్ మూవీ కూడా వచ్చింది… మరి మొత్తం మీద ప్రీమియర్స్ తర్వాత యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here