Home న్యూస్ జార్జ్ రెడ్డి ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

జార్జ్ రెడ్డి ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

      చిన్న సినిమాల్లో రీసెంట్ టైం లో అల్టిమేట్ క్రేజ్ ని సొంతం చేసుకున్న సినిమా జార్జ్ రెడ్డి, ఉస్మానియా స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి కథ తో తెరకెక్కిన ఈ బయోపిక్ రీసెంట్ టైం వస్తున్న చిన్న సినిమాల్లో బూతు కంటెంట్ తో కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కానీ క్రేజ్ తెచ్చుకున్న సినిమా కానీ, ఒక రియల్ లైఫ్ స్టొరీ తో అల్టిమేట్ ట్రైలర్ కట్ తో ఎక్స్ లెంట్ క్రేజ్ తెచ్చుకున్న జార్జ్ రెడ్డి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ముందుగా స్పెషల్ షోలు ఓవర్సీస్ ప్రీమియర్ షోలు పూర్తీ చేసుకున్న ఈ సినిమా కి ఎలాంటి టాక్ లభిస్తుందో తెలుసుకుందాం పదండీ. ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే ట్రైలర్ లో చెప్పినట్లే ఉస్మానియా లో ఒకప్పుడు కాస్ట్ వైజ్ గా స్టూడెంట్స్ ని ఎలా విడదీసి హిస్మించే వారో వారిని జార్జ్ రెడ్డి ఎలా ఎదిరించి పోరాడాడో…

అన్నది సినిమా కథ. కథ పాయింట్ రియల్ స్టొరీ అవ్వడం తో టోటల్ బయోపిక్ లా స్లో నరేషన్ ఉంటుంది అనుకున్న వాళ్లకి షాక్ ఇస్తూ ఫస్టాఫ్ మొత్తం అల్టిమేట్ గూస్ బంప్స్ తెప్పించే కొన్ని సీన్స్ తో డైరెక్టర్ అదరగొట్టేశాడు అని చెప్పాలి. మంచి స్పీచ్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడగా…

సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అయినా తిరిగి పోలిస్ స్టేషన్ సీన్, రైన్ ఫైట్ తో బాలెన్స్ చేయగా ఎమోషనల్ క్లైమాక్స్ తో ఆకట్టుకుని ఓవరాల్ గా ఒక మంచి సినిమా చూశాం అనిపించేలా సినిమా ఉంటుందని, బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ లో ఉంటుందని చూసిన వాళ్ళు చెబుతున్నారు.

ఓవరాల్ గా ఓ 5-6 సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని, కచ్చితంగా అందరికీ నచ్చుతుందని చెబుతున్నారు. ఇటు స్పెషల్ షోలకు అటు ఓవర్సీస్ నుండి కూడా ఇదే రేంజ్ టాక్ వినిపిస్తుండటం తో యునానిమస్ హిట్ టాక్ తో సినిమా రిలీజ్ కానుంది అని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ టాక్ కంటిన్యు అయితే అన్ సీజన్ లో మంచి కలెక్షన్స్ తో సినిమా జోరు చూపోచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here