Home న్యూస్ టాలీవుడ్ ఫ్యాన్స్ కి….మమ్మోత్ టార్గెట్ రెడీ…ఎవరు కొడతారో ఇక!

టాలీవుడ్ ఫ్యాన్స్ కి….మమ్మోత్ టార్గెట్ రెడీ…ఎవరు కొడతారో ఇక!

0

సోషల్ మీడియా రికార్డుల విషయంలో, ట్విట్టర్ ట్రెండ్స్ రికార్డులు, యూట్యూబ్ రికార్డుల విషయంలో పోటా పోటీ గా దుమ్ము లేపుతారు టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్…మన దగ్గర టాప్ స్టార్స్ ఎక్కువ అవ్వడంతో సోషల్ మీడియా వార్స్ అండ్ ట్రెండ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక ఫ్యాన్స్ లో లాస్ట్ 2 ఏళ్లలో…

రీ రిలీజ్ ల ఫీవర్ పెరిగిపోయింది, పోకిరి సినిమా నుండి మొదలైన ఈ ట్రెండ్ తర్వాత జల్సా, బిజినెస్ మాన్, సింహాద్రి ఇలా చాలా సినిమాలు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్నాయి, కానీ రీ రిలీజ్ ల ట్రెండ్ ఓవర్ ది బోర్డ్ వెళ్ళడంతో రీసెంట్ టైంలో వచ్చిన రీ రిలీజ్ మూవీస్ భారీగా నిరాశ పరిచాయి.

ఇదే టైంలో తమిళ్ నుండి భారీ లెవల్ లో వచ్చిన విజయ్ గిల్లి మూవీ రీ రిలీజ్ రికార్డుల బెండు తీసింది….4 రోజుల్లో ఆల్ మోస్ట్ 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. స్టిల్ కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో లాంగ్ రన్ లో ఇంకా కలెక్షన్స్ పెరగవచ్చు…ఫైనల్ లెక్క 18-20 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు….

AP-TG 9th Day Highest Share Movies

దాంతో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేశారు విజయ్ ఫ్యాన్స్…ఇక టాలీవుడ్ లో అప్ కమింగ్ టైంలో రిలీజ్ అయ్యే రీ రిలీజ్ మూవీస్ లో మేజర్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజు టైం లో ఆది మూవీ రీ రిలీజ్ కానుంది. అలాగే మహేష్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు టైంలో రిలీజ్ అయ్యే మూవీస్ కన్ఫాం అవ్వాల్సి ఉండగా…

ఈ మూడు మేజర్ హీరోల పుట్టిన రోజు టైంలో రిలీజ్ అయ్యే మూవీస్ కి గిల్లి సినిమా టార్గెట్ టచ్ చేయడానికి కూడా అందనంత ఎత్తులో రికార్డ్ పెట్టారు…మరి మన హీరోల అప్ కమింగ్ రీ రిలీజ్ మూవీస్ లో ఈ రికార్డ్ ను అందుకునే మూవీ లేదా దగ్గరగా వెళ్ళే మూవీ ఏదైనా వస్తుందో లేదో ఈ ఇయర్ ఎండ్ టైంకి తేలనుంది…

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here