Home న్యూస్ విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం OTT బిజినెస్….రికార్డు భీభత్సం ఇది!

విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం OTT బిజినెస్….రికార్డు భీభత్సం ఇది!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. బాక్ టు బాక్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతున్న విజయ్ ఇప్పుడు త్వరలో ఫుల్ టైం పొలిటికల్ కెరీర్ ని మొదలు పెట్టబోతుండగా ఈ గ్యాప్ లో చేస్తున్న చివరి సినిమాల మీద..

ఆడియన్స్ లో సాలిడ్ హైప్ అయితే ఉందని చెప్పాలి…ప్రస్తుతం విజయ్ చేస్తున్న కొత్త సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) లాస్ట్ ఇయర్ కస్టడీతో ఫ్లాఫ్ కొట్టిన వెంకట్ ప్రభు డైరెక్షన్ లో చేస్తూ ఉండగా ఈ సినిమా మీద మరీ విజయ్ నటించిన లాస్ట్ మూవీస్ తో పోల్చితే రికార్డ్ లెవల్ లో బజ్ లేక పోయినా కూడా…

ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో క్రేజ్ అయితే ఉందని చెప్పాలి…ఎక్స్ పెరిమెంటల్ కంటెంట్ తో వస్తున్న  గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రిలీజ్ సెప్టెంబర్లో ఉండబోతుండగా రిలీజ్ ఇంకా టైం ఉండగానే రీసెంట్ గా సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకి అమ్మేసినట్లు తెలుస్తుంది…..

జీ నెట్ వర్క్ వాళ్ళు ఓవరాల్ సినిమా డిజిటల్ హక్కులను అన్ని భాషలకు గాను సొంతం చేసుకున్నారట….ఈ రైట్స్ కోసం ఆల్ మోస్ట్ 90 కోట్లకు పైగా రేటు ని చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ రేంజ్ రేటు ఒక ఎక్స్ పెరిమెంటల్ మూవీకి సొంతం అవ్వడం, అది కూడా ఫ్లాఫ్ కొట్టిన డైరెక్టర్ తో చేస్తున్నా కూడా…

సొంతం చేసుకోవడం విజయ్ క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి. రీసెంట్ గా సినిమా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయగా సాంగ్ యావరేజ్ గా ఉన్నా కూడా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక సినిమా టీసర్ ట్రైలర్ లు రిలీజ్ అయ్యాక సినిమా మీద బజ్ మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here