Home న్యూస్ విష్ణు కెరీర్ లోనే జిన్నా బెస్ట్ ఫిల్మ్….ఫ్లాఫ్ అవుతుందని అనుకోలేదు-మోహన్ బాబు!!

విష్ణు కెరీర్ లోనే జిన్నా బెస్ట్ ఫిల్మ్….ఫ్లాఫ్ అవుతుందని అనుకోలేదు-మోహన్ బాబు!!

0

టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ లో తనకంటూ ఒక సెపరేట్ పేరుని సొంతం చేసుకున్న నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు…. హీరోగా మోహన్ బాబు అయినంత సక్సెస్ అయన కొడుకులు మాత్రం అస్సలు కాలేదని చెప్పాలి. కొన్ని డీసెంట్ హిట్స్ పడినా కానీ కెరీర్ లో మంచు హీరోలు ఇతర హీరోలతో రేసులో పూర్తిగా వెనకబడిపోయారు… రీసెంట్ గా పుట్టిన రోజుని జరుపుకున్న మోహన్ బాబు స్పెషల్ ఇంటర్వ్యూలో వీటి గురించి మాట్లాడుతూ…

ఒక టైంలో లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆడియన్స్ కి అందించామని కానీ ఇప్పుడు ఆ బ్యానర్ నుండి ఫ్లాఫ్స్ రావడం జరుగుతుందని, లాస్ట్ ఇయర్ నేను చేసిన సన్ ఆఫ్ ఇండియా ఎక్స్ పెరిమెంటల్ మూవీ కాగా ఆ సినిమా ఫ్లాఫ్ పెద్దగా భాదించలేదు కానీ…

అదే ఇయర్ లో మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా విష్ణు కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అని, కానీ ఆ సినిమా ఫ్లాఫ్ అవ్వడం తట్టుకోలేక పోయాయని, మంచి సినిమా ఫ్లాఫ్ అయిందని చెప్పుకొచ్చారు మోహన్ బాబు… సోషల్ మీడియాలో తమ ఫ్యామిలీ పై వచ్చే ట్రోల్స్ ని…

నేను పెద్దగా పట్టించుకోనని చెప్పిన మోహన్ బాబు జిన్నా సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా అని, కానీ ఫ్లాఫ్ అవ్వడం భాదించింది అంటూ చెప్పడంతో, సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యేంత కథ సినిమాలో ఏముందా అని తిరిగి రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు…. మరి ఫ్యూచర్ లో అయినా మంచు హీరోలు మంచి సక్సెస్ లు అందుకుంటారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here