బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి 2 వారాలను పూర్తీ చేసుకోగా సినిమా కి ఆడియన్స్ లో సూపర్ పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ 5 డేస్ వీకెండ్ లో తప్పితే తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి జోరుని సినిమా చూపించలేదు. సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ అలాగే రెండో వారంలో సాధించిన కలెక్షన్స్ గ్యాప్ ఎక్కువగా ఉంది.
సినిమా ఇతర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలతో పోల్చితే చాలా వీక్ గానే రెండో వీక్ లో పెర్ఫార్మ్ చేసింది, ఫస్ట్ వీక్ లో తెలుగు రాష్ట్రాల్లో 39.30 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 53.10 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక రెండో వారంలో సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 3.42 కోట్ల షేర్ ని మాత్రమే అందుకుని ఆల్ మోస్ట్ 90% డౌన్ అయింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 4.56 కోట్ల షేర్ ని మాత్రమే అందుకుని వరల్డ్ వైడ్ గా కూడా భారీగా స్లో అయింది.
దాంతో రెండో వారంలో గ్రోత్ చూపించక పోవడం ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ పై గట్టి ఇంపాక్ట్ నే చూపించబోతుంది అని చెప్పాలి. ఇక మూడో వారంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి.