Home Uncategorized అసలు ప్రమోషన్స్ లేవు…అయినా పరాయి గడ్డపై మెగాస్టార్ రాంపేజ్!

అసలు ప్రమోషన్స్ లేవు…అయినా పరాయి గడ్డపై మెగాస్టార్ రాంపేజ్!

2

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ల కాంబినేషన్ లో మళయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఆడియన్స్ ముందుకు రావడానికి ఇంకో 2 వారాలు కూడా టైం లేదు కానీ సినిమా యూనిట్ అసలు ప్రమోషన్స్ లాంటివి ఏమి అస్సలు చేయడం లేదు. ఆ ఇంపాక్ట్ సినిమా బిజినెస్ పై కూడా పడినా కానీ తిరిగి బిజినెస్ పరంగా…

డీల్స్ సెట్ అవుతూ బిజినెస్ పరంగా బజ్ ను మళ్ళీ సొంతం చేసుకుంటూ వెళుతుంది, కాగా సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ లెక్క ఇంకా క్లియర్ అవ్వాల్సి ఉండగా సినిమా ఓవర్సీస్ బిజినెస్ మట్టుకు ఇప్పుడు కంప్లీట్ అయిందని అంటున్నారు.

పెద్దగా ప్రమోషన్స్ కూడా ఏమి జరుపుకోని ఈ సినిమా కి ఇప్పుడు టోటల్ ఓవర్సీస్ లో 8 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందని అంచనా వేస్తున్నారు. ఇందులో కూడా కేవలం అమెరికాలోనే ఆల్ మోస్ట్ 7 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సినిమా అక్కడ సొంతం చేసుకుందట.

కాగా సినిమా అమెరికాలో మొత్తం మీద ఇప్పుడు 2 మిలియన్ డాలర్స్ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అసలు ప్రమోషన్స్ ఏమి జరగక పోయినా ఇలాంటి బిజినెస్ జరగడం గొప్ప విషయం అనే చెప్పాలి. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారిందని చెప్పాలి.

2 COMMENTS

Leave a Reply to T2BLive.Com Cancel reply

Please enter your comment!
Please enter your name here