7 ఏళ్ల క్రితం సౌత్ ని మొత్తం ఒక ఊపు ఊపిన సినిమాల్లో ముందు నిలిచే సినిమా ప్రేమం. మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ లో ఓ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించగా డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత సౌత్ మొత్తం ఒక ఊపు ఊపేసింది. ఆ సినిమా డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రెన్ డైరెక్షన్ లో కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూడగా…
ఆల్ మోస్ట్ 7 ఏళ్ల తర్వాత ఈ డైరెక్టర్ నుండి వచ్చిన కొత్త సినిమా గోల్డ్ లో పృద్విరాజ్ మరియు నయనతారలు జంటగా నటించగా రిలీజ్ కి ముందు ఒక్క టీసర్, ప్రోమో, ట్రైలర్ లాంటివి ఏమి లేకున్నా సాలిడ్ హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
రిలీజ్ అయిన తర్వాత అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో హైప్ ఉన్నా మొదటి రోజు పర్వాలేదు అనిపించినా తర్వాత కంప్లీట్ గా క్రాష్ అయిన ఈ సినిమా అతి కష్టం మీద ఇప్పటి వరల్డ్ వైడ్ వైడ్ గా 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే వసూల్ చేసి నిరాశ పరిచింది.
సినిమాను ఎంత ప్రమోట్ చేసినా ఆడియన్స్ థియేటర్స్ కి రాని ప్రస్తుత టైం లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన సినిమాకి టాక్ కొంచం తేడాగా వచ్చినా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అనడానికి ఈ సినిమా నిదర్శనం అంటూ ఇప్పుడు అక్కడ చెప్పుకుంటున్నారు.