కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) లెక్కలు సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది కానీ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా మీద సాలిడ్ గా అంచనాలు ఏర్పడగా…
ఆ అంచనాలను అమాంతం పెంచేసింది సినిమా అఫీషియల్ టీసర్…వింటేజ్ అజిత్ కుమార్ ను చూపెడుతూ కట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ టీసర్ ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేసింది…సరైన బ్యాగ్రౌండ్ స్కోర్ పడి ఉంటే ఆ ఇంపాక్ట్ ఇంకో లెవల్ లో ఉండేది కానీ ఓవరాల్ గా…
గుడ్ బ్యాడ్ అగ్లీ టీసర్ తో రీసెంట్ టైంలో అజిత్ సినిమాల్లోకి బెస్ట్ ఔట్ పుట్ రాబోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉండగా టీసర్ కూడా కోలివుడ్ లో అల్టిమేట్ రికార్డులను నమోదు చేసింది టీసర్ ల విషయంలో… ఆల్ టైం రికార్డ్ వ్యూస్ ను 24 గంటల్లో సొంతం చేసుకున్న…
గుడ్ బ్యాడ్ అగ్లీ టీసర్ తమిళ్ ఇండస్ట్రీ పరంగా బిగ్గెస్ట్ రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేయడం విశేషం. ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ టీసర్ కి 31.15 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యి ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను కోలివుడ్ టీసర్ ల తరుపున సొంతం చేసుకోగా…
లైక్స్ పరంగా మరీ రికార్డు లెవల్ లో కాకపోయినా 791K లైక్స్ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద వ్యూస్ పరంగా ఎపిక్ రికార్డ్ ను లైక్స్ పరంగా సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సినిమా మీద అంచనాలను…
మరింతగా పెంచేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా టీసర్ రేంజ్ లో సినిమా వచ్చే నెల మెప్పించగలిగితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అజిత్ కుమార్ ఈ సినిమాతో సెన్సేషనల్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక సినిమా ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.