Home గాసిప్స్ హిట్టు కొట్టి 6 ఏళ్ళు…ఈ ఛాన్స్ నిజం అయితే కెరీర్ బిగ్గెస్ట్ టర్నింగ్ పక్కా!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు…ఈ ఛాన్స్ నిజం అయితే కెరీర్ బిగ్గెస్ట్ టర్నింగ్ పక్కా!

0

మంచి టాలెంట్ ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్స్ ని సొంతం చేసుకోలేక పోతున్న హీరోల్లో మాచో మ్యాన్ గోపీచంద్ కూడా ఒకరు అని చెప్పాలి. కెరీర్ మొదలు పెట్టడం హీరోగా మొదలు పెట్టి వర్కౌట్ అవ్వక విలన్ గా మారి అద్బుతమైన విజయాలను సొంతం చేసుకుని తిరిగి హీరోగా మారి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్స్ ని సొంతం చేసుకున్న గోపీచంద్ తర్వాత అడపాదడపా హిట్స్ తప్ప ఎక్కువగా ఫ్లాఫ్స్ నే సొంతం చేసుకున్నాడు.

సాహసం మరియు లౌక్యం లాంటి రెండు మంచి సినిమాలు పడ్డ తర్వాత గోపీచంద్ కెరీర్ ఇక ఊపు అందుకుంటుంది అనుకున్నా అందరికీ షాక్ ఇస్తూ వరుస ఫ్లాఫ్స్ తో కెరీర్ లో పూర్తిగా డౌన్ ఫాల్ అవుతున్న కానీ గోపీచంద్ తో సినిమాల ఆఫర్స్ మాత్రం అస్సలు తగ్గక పోవడం విశేషం అనే చెప్పాలి.

ప్రస్తుతం సీటి మార్ సినిమా పై ఆశలు పెట్టుకున్న గోపీచంద్ ఈ సినిమా తర్వాత కూడా కొన్ని మంచి ప్రాజెక్ట్ లు కమిట్ అవ్వగా ఇప్పుడు లేటెస్ట్ గా ఒక రూమర్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, ఆ రూమర్ ప్రకారం ఇప్పుడు టాలీవుడ్ లో మొదలు అయిన క్రేజీ మూవీస్ లో ఒకటైన ఎఫ్ 2 సినిమా సీక్వెల్…

ఎఫ్ 3 లో ఇద్దరు హీరోలతో పాటు మరో కీలక రోల్ ఉండగా ఆ రోల్ కోసం మరో స్టార్ హీరో ని వెతుకుతున్నాడట అనిల్ రావిపూడి, ముందు రవితేజ తో అనుకున్నా కానీ ఎందుకనో సెట్ కాలేదట, తర్వాత ఇతర హీరోల పేర్లు వినిపించినా ఏవి కూడా కన్ఫాం కాలేదు కానీ ఇప్పుడు గోపీచంద్ ని ఆ రోల్ కోసం కన్సిడర్ చేస్తున్నారు అనేది లేటెస్ట్ గా… ఇండస్ట్రీ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది,

ఇద్దరు ఫ్రస్ ట్రేటర్స్ తో మరో ఫ్రస్ ట్రేటెడ్ పెళ్ళైన హీరో జాయిన్ అయితే ఎలా ఉంటుంది అన్న పాయింట్ తో కొన్ని సీన్స్ ఉంటాయి అని ఆ సీన్స్ కి గోపీచంద్ బాగా సూట్ అవుతాడని భావిస్తున్నట్లు సమాచారం. ఇది కనుక నిజం అయ్యి గోపీచంద్ ఒప్పుకుంటే సినిమా రీచ్ సాలిడ్ గా ఉంటుంది కాబట్టి అది తన కెరీర్ కి బాగా ఉపయోగ పడే అవకాశం ఉంది, మరి ఈ న్యూస్ నిజం అవుతుందో కాదో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here