Home న్యూస్ ఉప్పెన సినిమాని షాకింగ్ రేటుకి కొన్న నెట్ ఫ్లిక్స్….ఇదే కండీషన్!

ఉప్పెన సినిమాని షాకింగ్ రేటుకి కొన్న నెట్ ఫ్లిక్స్….ఇదే కండీషన్!

2770
0

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అవుతున్న కొత్త కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన, సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కొత్త హీరో సినిమా కి పెట్టాల్సిన అమౌంట్ కన్నా కూడా ఎక్కువ మొత్తం తోనే తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వస్తుండగా డిజిటల్ రిలీజ్ కి…

సాలిడ్ ఆఫర్లు వచ్చినా కానీ ఎప్పటి కప్పుడు నో చెబుతూ వస్తున్న టీం సినిమా ను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా సినిమా ఇప్పుడు 2021 లో జనవరి ఎండ్ లో కానీ ఫిబ్రవరి లో కానీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇక సినిమా డిజిటల్ రైట్స్ ని…

రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సాలిడ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. కొత్త హీరో సినిమానే అయినా కానీ ఏకంగా 8.5 కోట్ల రేంజ్ లో రేటు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకున్నారని అంటున్నారు. కానీ ఇది సినిమా డైరెక్ట్ రిలీజ్ కోసం కొన్న రేటు కాదని క్లారిటీ కూడా వచ్చింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి పరుగును పూర్తీ చేసుకున్నాక సినిమా డైరెక్ట్ రిలీజ్ అవుతుందని క్లియర్ అయ్యింది, అందుకోసం సినిమా కి 30 డేస్ టైం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది, సినిమా రిలీజ్ అయిన మొదటి నెలలో సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ను బట్టి సినిమాను డిజిటల్ రిలీజ్ ను కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఆ లెక్కన చూసుకుంటే ఈ రేటు…

అద్బుతమైన రేటు అనే చెప్పాలి, అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తే అంత మొత్తం ఇటు డిజిటల్ రిలీజ్ కి ఎక్కువ రేటు దక్కడం, ఇంకా ఇతర భాషల రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నిర్మాతలు ఎట్టి పరిస్థితులలో సినిమా ద్వారా నష్టాలను సొంతం చేసుకునే అవకాశం లేదని తెలుస్తుంది, అందుకే ఆలస్యం అయినా కానీ వెయిట్ చేస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here