Home న్యూస్ 2656 కోట్లు….చరిత్రలో ఎవ్వరికీ లేని రికార్డ్ ఇది!

2656 కోట్లు….చరిత్రలో ఎవ్వరికీ లేని రికార్డ్ ఇది!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ హీరోకి కూడా సాధ్యం కాని ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న హీరో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)…ఎప్పటి నుండో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 2023 లో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా ఈ ఇయర్ 3 సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాగా…

అందులో 2 సినిమాలతో ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపడం విశేషం, కాగా ఇప్పుడు ఓవరాల్ గ 2023 ఇయర్ కి గాను షారుఖ్ ఖాన్ నటించిన సినిమాల కలెక్షన్స్ లెక్కలు ఏకంగా 2600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి 2656 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుని చరిత్ర కెక్కే రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు షారుఖ్ ఖాన్.

ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన పఠాన్(Pathaan Movie) టోటల్ రన్ లో 1051 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకోగా బిగ్గెస్ట్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇయర్ సెకెండ్ ఆఫ్ లో జవాన్(Jawan Movie)తో వచ్చిన షారుఖ్ ఖాన్ ఆ సినిమా తో సంచలన కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…

పఠాన్ మూవీ కలెక్షన్స్ ని క్రాస్ చేసి టోటల్ రన్ లో 1160 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా బాక్ టు బాక్ 1000 కోట్ల గ్రాస్ మూవీస్ తో సంచలనం సృష్టించిన తర్వాత ఇయర్ ఎండ్ లో డంకి(Dunki Movie) తో వచ్చిన షారుఖ్ ఈ సారి మాత్రం అంచనాలను…

పూర్తిగా అందుకోలేదు కానీ ఉన్నంతలో ఈ సినిమా ఇప్పటి వరకు 446 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా టోటల్ గా 3 సినిమాల టోటల్ గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 2656 కోట్ల మార్క్ ని దాటేసింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ హీరో కూడా ఒక్క ఏడాది టైంలో ఈ రేంజ్ లో వసూళ్ళతో ఊచకోత కోయలేదు… ఈ రికార్డ్ ఒక్క షారుఖ్ కే సొంతం అవ్వడం విశేషం…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here