బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు భారీ అంచనాలను సొంతం చేసుకున్న సినిమాల్లో చిన్న సినిమాగా అనుకున్న సాలిడ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న హనుమాన్(Hanuman Movie) ఒకటి…. తేజ సజ్జ మరియు ప్రశాంత్ వర్మల కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఈ సమ్మర్ లోనే రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యి మిగిలిన సినిమాల కన్నా ముందే సంక్రాంతికి అనౌన్స్ చేశారు. ఇప్పుడు భారీ పోటి ఉన్నప్పటికీ కూడా హనుమాన్ సినిమా మీద ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ట్రైలర్ క్వాలిటీ పరంగా ఎక్స్ లెంట్ గా ఉండగా…
కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కొంచం ఓకే అనిపించేలా ఉన్నా కానీ చాలా వరకు సీన్స్ మాత్రం ఎక్స్ లెంట్ గా అనిపించాయి. ఇక ఈ సీన్స్ అన్నీ చూసి సినిమా ఓవరాల్ గా ఎన్ని కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కి ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా చిన్న సినిమా అనుకున్నా కూడా ఓవరాల్ గా ఓ మీడియం రేంజ్ మూవీ లెవల్ లో…
భారీ బడ్జెట్ తోనే సినిమా తెరకెక్కింది.. ఓవరాల్ గా సినిమా 40 కోట్ల రేంజ్ నుండి 42 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కింది అని సమాచారం. పబ్లిసిటీ అండ్ ప్రింట్ ఖర్చులు కూడా కలుపుకుంటే ఆల్ మోస్ట్ 45 కోట్ల రేంజ్ బడ్జెట్ లో సినిమా తెరకెక్కింది అని చెప్పొచ్చు.
ఈ రేంజ్ బడ్జెట్ ఓ చిన్న సినిమా అనుకున్న హనుమాన్ కి పెట్టడం మామూలు విషయం కాదు, ఇక మేకర్స్ కి కూడా చాలా వరకు నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే మంచి అమౌంట్స్ వెనక్కి వచ్చాయి అంటున్నారు. ఆ లెక్కలు త్వరలో తేల నుండగా ఓవరాల్ గా సంక్రాంతికి సినిమా ఇక భారీ పోటిని తట్టుకుని ఎలా జోరు చూపిస్తుందో చూడాలి.
1