బాక్స్ ఆఫీస్ దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో తన సినిమాలకు రికార్డ్ లెవల్ లో వ్యూస్ రావడంతో ఆడియన్స్ భారీ లెవల్ లో తనని చూడటానికి థియేటర్స్ కి వస్తారు అనుకుని భారీ లెవల్ లో ఛత్రపతి సినిమాను అక్కడ రీమేక్ చేయగా ఇప్పుడు సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ చూసి అందరికీ కూడా మైండ్ బ్లాంక్ అయిపొయింది అని చెప్పాలి ఇప్పుడు.
సినిమా మొదటి రోజే కేవలం 50 లక్షల లోపే నెట్ కలెక్షన్స్ ని అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సినిమా కోసం నెల రోజులుగా బాలీవుడ్ లో చాలా ఏరియాల్లో ప్రమోషన్స్ ని చేశారు టీం. కానీ ఇప్పుడు ఇలాంటి ఓపెనింగ్స్ చూసి అందరూ నిరాశ పడుతున్నారు..
సినిమా ప్రమోషన్స్ కోసమే ఆల్ మోస్ట్ కోటి 20 నుండి కోటిన్నర దాకా ఖర్చు చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కానీ ఇంత ఖర్చు చేసి ప్రమోషన్స్ చేసినా కూడా ఛత్రపతి హిందీ మూవీ మొదటి రోజున పట్టుమని 50 లక్షలు కూడా వసూల్ చేయలేక పోయింది. ఫస్ట్ డే వర్త్ షేర్ లెక్క…
కేవలం 22 లక్షల రేంజ్ లోనే ఉంటుందని అంటున్నారు. ఏదైనా నార్మల్ కమర్షియల్ మూవీ చేసినా తెలుగు రాష్ట్రాల నుండే బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇంతకు మించి ఓపెనింగ్స్ కచ్చితంగా వచ్చి ఉండేవి కానీ ఇప్పుడు అసలుకే దెబ్బ పడినట్లు అయింది తన పరిస్థితి… ఇక సినిమా వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో చూడాలి.