తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విక్రమ్ వేద సినిమాను అదే పేరుతో హిందీ లో హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీ ఖాన్ ల కాంబినేషన్ లో తెరకెక్కించగా సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చింది… ఒరిజినల్ కథని ఆల్ మోస్ట్ అలానే తెరకెక్కించిన ఈ సినిమా అక్కడ కూడా చాలా వరకు మెప్పించే విధంగా ఉందని చెప్పాలి. ఒకసారి సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే…
పోలిస్ అయిన సైఫ్ అలీ ఖాన్ హత్యలు చేస్తున్న హృతిక్ రోషన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా ఒక గ్యాంగ్ వార్ లో హృతిక్ తమ్ముడిని చంపేస్తాడు… తర్వాత ఏం జరిగింది, హృతిక్ తర్వాత ఏం చేశాడు అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్….
హృతిక్ రోషన్ ఒరిజినల్ లో విజయ్ సేతుపతి చేసిన రోల్ ని చాలా బాగా చేశాడు… విజయ్ సేతుపతిని మరిపించి ఆ రోల్ లో దుమ్ము దులిపేశాడు అని చెప్పాలి. ఇక సైఫ్ రోల్ కూడా బాగుండగా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా తీశారు డైరెక్టర్….
ఒరిజినల్ చూసిన వాళ్ళకి సినిమా బాగుంది అనిపిస్తుంది కానీ అదే టైం లో ఒరిజినల్ చూడని వాళ్ళకి సినిమా ఇంకా బాగా నచ్చుతుంది, కొన్ని ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీన్స్, హృతిక్ డాన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ చూడని వాళ్ళకి థ్రిల్ ని కలిగించడం ఖాయం… మొత్తం మీద సినిమా ఒరిజినల్ మ్యాజిక్ ని చాలా వరకు రీ క్రియేట్ చేసింది అని చెప్పాలి…
కొంచం లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ అక్కడక్కడా కలిగినా సినిమా సెకెండ్ ఆఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ క్లిమాక్స్ ఫైట్ సీన్ మంచి ఇంపాక్ట్ ఫుల్ గా ఉండటంతో ఓవరాల్ గా ఓ మంచి యాక్షన్ మూవీ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం ఖాయమని చెప్పొచ్చు…