Home న్యూస్ హాలిడేస్ పొడగింపు…ఇక ఈ సినిమాలకు పండగే!

హాలిడేస్ పొడగింపు…ఇక ఈ సినిమాలకు పండగే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చిన 4 సినిమాల్లో ఒక సినిమా మాత్రం తీవ్రంగా నిరాశ పరిచినా కూడా మిగిలిన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్నాయి. కనుమ హాలిడే తర్వాత ఆల్ మోస్ట్…

అన్ని సినిమాలకు సంక్రాంతి పండగ హాలిడేస్ కంప్లీట్ అవ్వడంతో ఇక వర్కింగ్ డేస్ లో సినిమాల ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా నైజాంలో ఒక్క హనుమాన్(HanuMan Movie) మినహా మిగిలిన సినిమాలు అన్నీ కూడా డ్రాప్ అవ్వగా…

ఆంధ్ర సీడెడ్ ఏరియాలలోనే మిగిలిన సినిమాలు మంచి జోరుని చూపెడుతున్నాయి…అక్కడ కనుమ తర్వాత రోజు కూడా పార్షిక హాలిడే ను ఇవ్వగా స్కూల్స్ ఓవరాల్ గా 21వరకు హాలిడేస్ ను పొడిగించారు. దాంతో సినిమాలు అన్నింటికీ కూడా మిగిలిన వర్కింగ్ డేస్ కూడా అక్కడ పార్షిక హాలిడేస్ లా మారడంతో…

సినిమాలు అన్నీ మంచి రెవెన్యూలను అక్కడ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది…ఆ ఇంపాక్ట్ 17న ఈవినింగ్ షోల నుండే కనిపించగా చాలా చోట్ల ఆంధ్రలో సీడెడ్ లో హనుమాన్, గుంటూరు కారం(Guntur Kaaram) మరియు నా సామి రంగ(Naa Saami Ranga) సినిమాలు మంచి జోరుని చూపించి అంచనాలను…

మించే వసూళ్ళని సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ సినిమాలకు లాంగ్ రన్ ఈ వీకెండ్ వరకు అక్కడ సొంతం కాబోతుంది. ఈ అడ్వాంటేజ్ ను వాడుకుని ఈ సినిమాలు ఆంధ్ర సీడెడ్ లలో ఎలాంటి కలెక్షన్స్ తో మాస్ రాంపెజ్ ను చూపిస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారిందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here