Home టోటల్ కలెక్షన్స్ 10 కోట్లు పెట్టి సినిమా తీస్తే వచ్చింది ఇది…నిర్మాతకి అయినా లాభామే!!

10 కోట్లు పెట్టి సినిమా తీస్తే వచ్చింది ఇది…నిర్మాతకి అయినా లాభామే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సినిమాలు నిరాశ పరిచినా కానీ నాన్ థియేట్రికల్ బిజినెస్ హెల్ప్ తో నిర్మాతలు అప్పుడప్పుడు సేఫ్ అవుతూ ఉంటారు, ఇప్పుడు లేటెస్ట్ గా సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హంట్ మూవీ థియేట్రికల్ రన్ లో డిసాస్టర్ గా నిలిచి తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ హెల్ప్ తో మొత్తం మీద నిర్మాతకి…

లాభాలను అయితే తెచ్చిపెట్టింది. సినిమాను మొత్తం మీద 10 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా చాలా ఏరియాల్లో ఓన్ గానే పెర్సెంటేజ్ బేస్ మీద సినిమాను రిలీజ్ చేశారు… వర్త్ బిజినెస్ 4 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా వేసినా సినిమా టోటల్ రన్ లో…

50 లక్షల లోపే షేర్ ని అందుకుని పరుగును కంప్లీట్ చేసి డిసాస్టర్ అయింది. అదే టైంలో సినిమాకి శాటిలైట్ రైట్స్ కింద 2.8 కోట్లు, డిజిటల్ రైట్స్ కింద 3.20 కోట్లు, హిందీ టెలివిజన్ అండ్ డిజిటల్ రైట్స్ కింద 6 కోట్ల దాకా రేటుని సొంతం చేసుకుందట. 

దాంతో నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 12 కోట్లు రాగా సినిమా కి మొత్తం మీద పెట్టిన బడ్జెట్ మీద థియేట్రికల్ రన్ లో లాస్ వచ్చినా నాన్ థియేట్రికల్ రైట్స్ తో వచ్చిన అమౌంట్ తో నిర్మాత కొద్దిగా సేఫ్ అయ్యాడు… సినిమా థియేట్రికల్ రన్ లో కొంచం బెటర్ గా పెర్ఫార్మ్ చేసి ఉంటె మేకర్స్ కి కొంచం ఎక్కువ లాభం దక్కి ఉండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here