Home న్యూస్ 2 రోజుల్లో టాలీవుడ్ నంబర్ 1….ఇది కదా మాస్ జాతర అంటే!!

2 రోజుల్లో టాలీవుడ్ నంబర్ 1….ఇది కదా మాస్ జాతర అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది, సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా నార్మల్ టైం లో రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా అంచనాలను మించి కలెక్షన్స్ ని మరో లెవల్ లో సొంతం చేసుకునే అవకాశం ఉన్న ఈ సినిమా ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా…

అనుకూలంగా లేకున్నా కానీ ఉన్న వనరులతోనే సెన్సేషనల్ హోల్డ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. కాగా సినిమా టాలీవుడ్ తరుపునే కాదు ఏకంగా ఇండియా తరుపున ఓపెనింగ్స్ విషయంలో సెకెండ్ వేవ్ తర్వాత బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసి ఊచకోత కోయగా…

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ నుండి సెకెండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచిన సీటిమార్ సినిమా కలెక్షన్స్ ని కేవలం 2 రోజుల్లోనే బ్రేక్ చేసి ఇప్పుడు టాలీవుడ్ నంబర్ 1 షేర్ మూవీ ఆఫ్టర్ సెకెండ్ వేవ్ గా నిలిచింది…

సీటిమార్ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని 2 వ రోజు మార్నింగ్ షో లకే బ్రేక్ చేసిన లవ్ స్టొరీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు కూడా అద్బుతమైన ట్రెండ్ ని కొనసాగిస్తూ దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. ఈ క్రమం లో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ ని అల్టిమేట్ కలెక్షన్స్ తో ముగించే అవకాశం ఎంతైనా ఉందని…

ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తుండగా సినిమా వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వర్కింగ్ డేస్ లో సినిమా హోల్డ్ చేస్తే ఇక వరుస పెట్టి పెద్ద సినిమాలు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవ్వొచ్చు… ఓవరాల్ గా లవ్ స్టొరీ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను సెకెండ్ వేవ్ తర్వాత ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here