Home న్యూస్ కల్కి-RRR కి మధ్యలో అక్షయ్ కుమార్ సినిమా….కొడితే మాత్రం రికార్డే!!

కల్కి-RRR కి మధ్యలో అక్షయ్ కుమార్ సినిమా….కొడితే మాత్రం రికార్డే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ మార్కెట్ లో RRR రికార్డుల బెండు తీసిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD (Kalki2898AD Movie) తెలుగు రాష్ట్రాల్లో మాత్రం RRR కన్నా చాలా వెనకబడే ఉంది…ఇక హిందీ విషయానికి వస్తే RRR movie సాలిడ్ లాంగ్ రన్ నే సొంతం చేసుకోగా ఇప్పుడు కల్కి మూవీ…

మెల్లి మెల్లిగా ఆర్ ఆర్ ఆర్ హిందీ లైఫ్ టైం కలెక్షన్స్ మార్క్ వైపు పరుగులు అయితే పెడుతుంది కానీ అక్కడ ఎలాంటి కలెక్షన్స్ తో రన్ ని కంప్లీట్ చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది…. 13 రోజుల్లో RRR సినిమా హిందీలో 204.32 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే….

13 రోజుల్లో కల్కి మూవీ 224 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా మిగిలిన రన్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ గా 276.80Cr కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా కల్కి ఈ కలెక్షన్స్ ని అందుకోవాలి అంటే ఇంకా 53 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుంది…

   

కానీ ఇప్పుడు RRR హిందీ కలెక్షన్స్ ని అందుకునే క్రమంలో బాలీవుడ్ లో ఈ వారం డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన లేటెస్ట్ మూవీ సర్ ఫిరా(Sarfira Movie) మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది…అక్షయ్ కుమార్ పెద్దగా ఫామ్ లో లేక పోయినా కూడా….

ఒరిజినల్ ఆకాశం నీ హద్దురా భారీ డిజిటల్ హిట్ అవ్వడంతో హిందీలో కూడా ఒరిజినల్ డైరెక్టరే డైరెక్ట్ చేస్తూ ఉండటంతో ఈ సినిమాతో అక్షయ్ కుమార్ కంబ్యాక్ ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా మరో పక్క ఇండియన్2(Indian2 Movie) కూడా రిలీజ్ కాబోతూ ఉండగా…

మేజర్ గా పోటి సర్ ఫిరా నుండి ఉండే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో ఎంతవరకు కల్కి మూవీ ఈ సినిమాల పోటిని తట్టుకుని RRR ని అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది…. ఒకవేళ అందుకుంటే మట్టుకు ప్రమోషన్స్ ఏమి లేకుండా పోటి ని తట్టుకుని ఈ మార్క్ ని సాధించి ఎపిక్ సంచలనం నమోదు చేసే అవకాశం ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here