బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ లో ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్ లో కొన్ని సినిమాలు మాత్రమే అంచనాలను అందుకోగా చాలా సినిమాలు పెద్దగా జోరుని అయితే చూపించలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న పెద్ద సినిమాలు ఆశించిన కలెక్షన్స్ ని అందుకోలేదు. ఇలాంటి టైంలో చిన్న పిల్లల సినిమా అయిన ఇన్ సైడ్ ఔట్2(Inside Out 2 Movie) మూవీ…
మంచి రివ్యూలు సొంతం చేసుకోగా అల్టిమేట్ కలెక్షన్స్ తో ఈ ఇయర్ హాలీవుడ్ లో వచ్చిన సినిమాల అన్ని రికార్డులు సైతం బ్రేక్ చేసి ఊహకందని ఊచకోత కోసింది…సినిమా ఆల్ మోస్ట్ 1600 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కగా చిన్న పిల్లల సినిమా కి ఈ రేంజ్ బడ్జెట్ ఏంటి అని అనుకున్నారు…
కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 550 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకోగా ఇండియన్ కరెన్సీ లో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 4565 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది…
ఇక టోటల్ ఇంటర్నేషనల్ మార్కెట్ 655 మిలియన్ డాలర్స్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా ఇండియన్ కరెన్సీ లో చెప్పాలి అంటే ఆల్ మోస్ట్ 5435 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది..ఓవరాల్ గా సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా…
అక్షరాలా 1.205 బిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది…ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 10,000 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హాలీవుడ్ లో వచ్చిన యానిమేషన్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీగా దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా జోరు పెంచే అవకాశం ఉందని అంటున్నారు.