అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ ని కొనసాగించింది, సినిమా కి రెండు రాష్ట్రాలలో మూడో రోజు కూడా అద్బుతమైన కలెక్షన్స్ దక్కాయి, IPL మ్యాచులు ఎలేక్షన్స్ ఎండింగ్ టైం కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఏర్పడింది కానీ అవి లేకుంటే కచ్చితంగా సినిమా మరింత జోరు గా కలెక్షన్స్ పరంగా కుమ్మేసి ఉండేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి, సినిమా టోటల్ గా రెండు రాష్ట్రాలలో…
మూడో రోజు మినిమమ్ 3.5 కోట్ల నుండి 3.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఎక్కువగా ఉంటె 4 కోట్ల మార్క్ ని అందుకునే చాన్స్ ఉందని భావించగా ఓవరాల్ గా డే ఎండ్ అయ్యే సమయానికి సినిమా టోటల్ గా 3.9 కోట్ల మార్క్ ని…
రెండు తెలుగు రాష్ట్రాలలో అధిగమించి సత్తా చాటుకుంది, IPL ఎఫెక్ట్ లేకుండా ఉంటె ఈ లెక్క కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల మార్క్ కి మించి ఉండేది అని చెప్పొచ్చు. టోటల్ గా 3 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మజిలీ సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే.
Nizam – 1.76 Crs Ceeded – 0.50 Crs UA – 0.55 Crs Guntur – 0.26 Crs East – 0.26 Crs West – 0.19 Crs Krishna – 0.29 Crs Nellore – 0.10 Cr Total Day 3 – 3.91 Cr… నైజాం అండ్ వైజాగ్ లలో సినిమా జోరు మరో లెవల్ లో ఉండగా సీడెడ్ లో క్లాస్ సినిమా తో కూడా కుమ్మేస్తున్నాడు నాగచైతన్య.
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ తెలియాల్సి ఉండగా వీకెండ్ మాత్రం అద్బుతంగా ముగించింది అని చెప్పాలి, ఇక వర్కింగ్ డేస్ లో కూడా సినిమా జోరు చూపితే లాంగ్ రన్ లో సంచలనాలు నమోదు చేసే చాన్స్ ఉంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.