Home న్యూస్ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టొరీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

ఇష్క్ నాట్ ఏ లవ్ స్టొరీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

తేజ సజ్జ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టొరీ… ఈ ఇయర్ ఆల్ రెడీ ఒక సూపర్ హిట్ కొట్టిన తేజ సజ్జ తో జోడి కట్టిన ప్రియా ప్రకాష్ వారియర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో సమ్మర్ టైం లోనే థియేటర్స్ లోకి రావాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన కుదరలేదు, కానీ డిజిటల్ రిలీజ్ కి సాలిడ్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పిన టీం సినిమాను ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యి…

వరల్డ్ వైడ్ గా 330 థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ కి వస్తే…. హీరో హీరోయిన్స్ లవ్ లో పడ్డ తర్వాత ఒక నైట్ కలిసి బయటికి వెళ్లి కారులో క్లోజ్ గా ఉన్న టైం లో ఒక వ్యక్తీ వీళ్ళ ఫోటోలు తీసి…

బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు, ఆ గొడవ ఎటు దారి తీసింది, హీరో తర్వాత ఏం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా లీడ్ పెయిర్ ఇద్దరూ ఆకట్టుకోగా, తేజ సజ్జ రెండు షేడ్స్ ఉన్న రోల్ లో మెప్పించాడు, హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా మెప్పించింది.

ఇక రవీంద్ర విజయ్ శాడిష్ట్ రోల్ లో బాగా చేశాడు. మిగిలిన రోల్స్ కి స్కోప్ తక్కువ… సాంగ్స్ బాగున్నాయి, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది, ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది, స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ బోర్ కొట్టినా సెకెండ్ ఆఫ్ పర్వాలేదు… డైలాగ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించాగా డైరెక్షన్ పరంగా య‌స్‌.య‌స్‌. రాజు…

కథని సరిగ్గా డీల్ చేయలేక పోయాడు… కొన్ని సీన్స్ బాగానే తీసినా ఫస్టాఫ్ మొత్తం సీన్స్ రిపీటివ్ గా అనిపించడం అండ్ సీన్స్ బోర్ కొట్టడం జరుగుతుంది, కానీ సెకెండ్ ఆఫ్ కొంచం బెటర్ గా ఉండటం తో మొత్తం మీద కొంచం కష్టంగా అయినా పర్వాలేదులే అన్నట్లు ముగుస్తుంది సినిమా…

ఓవరాల్ గా మరీ అనుకున్న రేంజ్ లో కాకున్నా పర్వాలేదు అనిపించే విధంగా సినిమా ఉంటుంది, ఫస్టాఫ్ మీద ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టి కథలో మరిన్ని మార్పులు చేర్పులు చేసి ఉంటే ఇంకా బెటర్ గా అనిపించేది సినిమా. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళితే పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా…. మరీ గట్టిగా చెప్పాలి అంటే జస్ట్ యావరేజ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here