Home న్యూస్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రివ్యూ…రేటింగ్!!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం రివ్యూ…రేటింగ్!!

0

సెకెండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన అల్లరి నరేష్ నాంది సినిమాతో మంచి సక్సెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటూ మరో కాన్సెప్ట్ బేసుడ్ మూవీతో వచ్చేశాడు. టీసర్ ట్రైలర్ లు సినిమా ఎలా ఉండబోతుందో ఆల్ రెడీ హింట్ ఇవ్వగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ.. ముందుగా సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే….

స్కూల్ టీచర్ అయిన హీరో మారేడుమిల్లి ట్రైబల్ విలేజ్ లో ఎలక్షన్స్ ని కోసం వెళతాడు, అక్కడికి వెళ్ళాక ఆ ఊరి గురించి ఆ ఊరి సమస్యల గురించి తెలుసుకుని హీరో ఏం చేశాడు, ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు, చివరికి ఊరి సమస్యలను ఎలా తీర్చాడు అన్నది మొత్తం మీద సినిమా స్టొరీ పాయింట్…. పెర్ఫార్మెన్స్ పరంగా అల్లరి నరేష్ సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు…

హీరోయిన్ ఆనంది ముందు హీరోయిన్ లా అనిపించినా తర్వాత సైడ్ క్యారెక్టర్ గా మారిపోతుంది, వెన్నెల కిషోర్ కామెడీ పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపిస్తుంది, ఫస్టాఫ్ వరకు కథ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పట్టినా ఊరిని చూపించి అక్కడ సమస్యలు చూపించడంతో హీరో ఎలా వీటిని సాల్వ్ చేస్తాడు అన్న ఆసక్తితో ఇంటర్వెల్ వరకు ఆకట్టుకోగా…

సెకెండ్ ఆఫ్ కథ కూడా చాలా వరకు ఆడియన్స్ ఊహలకు తగ్గట్లే సాగుతుంది, కానీ ఎందుకో నాందిలో హీరో పెయిన్ తో ఆడియన్స్ కనెక్ట్ అయినట్లు ఇక్కడ ఎమోషనల్ టచ్ అంతగా కనెక్ట్ కాక పోవడంతో ఎదో సీరియస్ కథ నడుస్తున్నా ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేరు. ఇక సినిమా లెంత్ కూడా ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగి అక్కడక్కడా బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది.

కానీ మొత్తం మీద మరో సిన్సియర్ అటెంప్ట్ తో అల్లరి నరేష్ చాలా వరకు మెప్పించగా డైరెక్టర్ చెప్పిన అపాయింట్ కూడా చాలా వరకు ఎంగేజింగానే ఆకట్టుకుంటుంది, కానీ ముందే చెప్పినట్లు ఎమోషనల్ కనెక్ట్ లేక పోవడం, లెంత్ కొంచం కొంచం ఎక్కువ అవ్వడం మైనస్ పాయింట్స్ కాగా అవి పక్కకు పెట్టి కొత్తదనం కోరుకునే ఆడియన్స్, అలాగే దిఫెరంట్ టైప్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here