Home గాసిప్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్ చెప్పిన జక్కన్న!!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్ చెప్పిన జక్కన్న!!

0

     టెంపర్ కి ముందు వరకు వరుస పరాజయాలను ఎదురుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ నుండి అరవింద సమేత వరకు ఒక్క అపజయం కూడా లేకుండా కెరీర్ ని కొనసాగిస్తూ దూసుకు పోతున్నాడు. కానీ అరవింద సమేత వచ్చిన రెండేళ్ళ తర్వాత కానీ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా లేదు… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నంబర్ 1 డైరెక్టర్ రాజమౌళి తో కలిసి చేస్తున్న….

సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఇయర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా లో ఇప్పటికే రామ్ చరణ్ పుట్టిన రోజు న స్పెషల్ ఇంట్రో టీసర్ ని రిలీజ్ చేశారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు కూడా త్వరలోనే రాబోతుంది కాబట్టి…

మరో స్పెషల్ టీసర్ పక్కా అనుకున్నా లాక్ డౌన్ వలన అది కుదిరేలా లేడని రీసెంట్ గా రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఫ్యాన్స్ భారీ ఎత్తున సోషల్ మీడియా జక్కన్న ని రిక్వెస్ట్ చేయగా లేటెస్ట్ గా టీవీ చానెల్స్ ఇంటర్వ్యూలో జక్కన్న ఎన్టీఆర్ బర్త్ డే కి…

కాన్సెప్ట్ ని అనుకున్నామని, ప్రస్తుతం టీం అదే పనిలో ఉందని చెబుతూ వాయిస్ ఓవర్ ఇచ్చేది రామ్ చరణ్ కాబట్టి ఆ డైలాగ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయని చెప్పారట. దాంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఈ న్యూస్ తో మళ్ళీ ఆశలు చిగురించాయి అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే…

రామ్ చరణ్ బర్త్ డే కోసం స్పెషల్ గా టీసర్ తయారు చేశారు, అది సినిమాలో ఉంటుందో లేదో అన్నది తెలియదు, కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డే కోసం స్పెషల్ టీసర్ షూట్ చేయలేరు కాబట్టి సినిమా లో ఫుటేజ్ నే ఎడిట్ చేసి ఇంట్రో టీసర్ గా మారుస్తారు అని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here