బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా జాతితర్నాలు డ్రీం రన్ మరో లెవల్ లో ఉంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది, అదే వేరే విషయం, అదే టైం లో సినిమా ఓవర్సీస్ మార్కెట్ ని మళ్ళీ సెట్ చేస్తూ దుమ్ము దుమారం చేయడం మాత్రం మరో లెవల్ అని చెప్పాలి, ముఖ్యంగా పాండమిక్ తర్వాత అమెరికాలో రిలీజ్ అయిన సినిమాలు ఏవి కూడా…
అంచనాలను అందుకోలేక పోయాయి… ఉన్నంతలో క్రాక్, ఉప్పెన సినిమాలు పర్వాలేదు అనిపించగా కోలివుడ్ టాప్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ అక్కడ టోటల్ రన్ లో 440K డాలర్స్ ని వసూల్ చేసి ఈ ఇయర్ కి గాను ఇండియా నుండే అక్కడ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న…
టాప్ మూవీ గా నిలిచింది… ఇప్పుడు ఆ రికార్డ్ ను కేవలం 3 రోజుల గ్యాప్ లో బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది జాతితర్నాలు సినిమా.. అమెరికా లో ఏకంగా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని కూడా ఇప్పుడు అందు కుని సంచలనం సృష్టించింది ఊచకోత కోసింది.
అమెరికాలో ఇప్పటికీ షరతులు అలానే ఉన్న కేవలం ఆక్యుపెన్సీ కొంచం పెంచారు, కానీ నైట్ 8 వరకు మాత్రమే షోలు పడతాయి అన్న కండీషన్ కూడా పెట్టారు, అయినా కానీ జాతితర్నాలు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లోనే అక్కడ 500K మార్క్ ని సొంతం చేసుకుని ఇప్పుడు లాంగ్ రన్ లో అక్కడ 1 మిలియన్ మార్క్ ని అందుకునే దిశగా…
అడుగులు వేస్తూ దూసుకు పోతూ ఉండటం విషయం. ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు 2021 కి గాను ఇండియా నుండి అమెరికాలో రిలీజ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీ గా సంచలన రికార్డ్ ను సొంతం చేసుకుంది జాతితర్నాలు. ఇక లాంగ్ రన్ లో మరెలాంటి అద్బుతాలు ఈ సినిమా నమోదు చేస్తుందో చూడాలి.