Home న్యూస్ 500K ఔట్…గోండు బెబ్బులి ఊచకోత…చరిత్రలో ఒకే ఒక్కడు!!

500K ఔట్…గోండు బెబ్బులి ఊచకోత…చరిత్రలో ఒకే ఒక్కడు!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 2 నెలలు కావోస్తున్నా లేటెస్ట్ గా రికార్డుల విషయంలో జోరు చూపుతూ దూసుకు పోతూనే ఉంది, రీసెంట్ గా ఈ ఇంట్రో టీసర్ టాలీవుడ్ తరుపున ఫాస్టెస్ట్ 35 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని…

దుమ్ము లేపే రికార్డ్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా ఫ్యాన్స్ కొత్తగా మొదలు పెట్టిన కామెంట్స్ కౌంట్ విషయం లో కూడా టాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ రికార్డులతో దూసుకు పోయిన ఈ టీసర్ అప్పటికే ఫాస్టెస్ట్ 70 వేల కామెంట్స్ నుండి ఏకంగా 4 లక్షల కామెంట్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా…

తర్వాత రెండు రోజులు తిరగక ముందే మరో రికార్డ్ ను నమోదు చేసి ఇప్పుడు ఏకంగా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని 5 లక్షల కామెంట్స్ మార్క్ తో టాలీవుడ్ చరిత్రలో హైయెస్ట్ కామెంట్స్ ని అత్యంత భారీ లీడ్ తో సొంతం చేసుకున్న టీసర్ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది రామరాజు ఫర్ భీమ్ ఇంట్రో టీసర్.

ఇండియా లో ఈ మార్క్ ని అందుకున్న రెండో టీసర్ గా నిలిచింది ఈ టీసర్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ రికార్డుల వేటలో ఉన్నారని తెలిసి రీసెంట్ గా రిలీజ్ అయిన మాస్టర్ టీసర్ కి కూడా కామెంట్స్ పెంచడం మొదలు పెట్టారు విజయ్ ఫ్యాన్స్, దాంతో ఇండియా లో మొదటి 5 లక్షల కామెంట్స్ మార్క్ రికార్డ్ ను వాళ్ళు సొంతం చేసుకోగా… ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మార్క్ ని అధిగమించి టాలీవుడ్ తరుపున…

నంబర్ 1 రికార్డ్ ను, ఇండియా తరుపున నంబర్ 2 రికార్డ్ ను సొంతం చేసుకున్నారు, ఇక టాలీవుడ్ తరుపున టీసర్స్ లో టాప్ 2 ప్లేసులలో ఆర్ ఆర్ ఆర్ సినిమా టీసర్లే ఉండగా రెండూ కూడా 35 మిలియన్స్ మార్క్ ని పూర్తీ చేసుకోవడం సినిమా పై ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పకనే చెబుతుంది. ఇక అఫీషియల్ టీసర్ ట్రైలర్ లకు రికార్డులు మరో లెవల్ లో ఉంటాయని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here