Home న్యూస్ జోహార్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!

జోహార్ రివ్యూ…ప్లస్ & మైనస్ పాయింట్స్!

2

కరోనా ఎఫెక్ట్ వలన థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన అనేక సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతుండగా… లేటెస్ట్ గా మరో సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంది, చిన్న సినిమానే అయినా టీసర్ ట్రైలర్స్ తో ఇంప్రెస్ చేసిన జోహార్ సినిమా రీసెంట్ గా ఆహా వీడియో లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంది. 2 గంటల నిడివి ఉన్న సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ విషయానికి వస్తే… 5 గురు వ్యక్తులు… ముఖ్యమంత్రి సడెన్ గా చనిపోవడం తో ఆయన ప్లేస్ లో ముఖ్యమంత్రి అయిన తన కొడుకు చైతన్య కృష్ణ తండ్రి కోసం ఒక భారీ విగ్రహాన్ని కట్టాలి అని ఫిక్స్ అవుతాడు. ఆ పని వల్ల… ఉద్దానం కిడ్నీ సమస్యతో భర్తని పోగొట్టుకొని కూతుర్ని కూడా పోగొట్టుకొనే పరిస్థితిలో ఉన్న తల్లి ఈశ్వరి రావ్..

తన హాస్టల్ లో పిల్లలకి ఎలాగైనా వసతి, సరైన తిండి కల్పించాలని ప్రభుత్వం దగ్గర ఋణం కోసం ట్రై చేసే శుభలేఖ సుధాకర్… రన్నింగ్ రేస్ లో ఇండియా కి గోల్డ్ మెడల్ కొట్టాలని కష్టపడే రోడ్డు మీద సర్కస్ చేసుకునే నైనా గంగూలీ…

వేశ్య గృహంలో ఉండే ఎస్తర్ అనిల్ చదువంటే ఇష్టం తో తను ప్రేమించిన వాడితో పారిపోతుంది.. ఇలా ఒకరికి ఒకరు సంభందం లేని ఈ 5 గురి కథే ఈ జోహార్.. ఒక్క భారీ విగ్రహం పెట్టడం కోసం పేదలకు అందాల్సిన నిధులను వాటుకుంటే ఆ పేదలు పడే కష్టం వివరించడం సినిమా ఉద్దేశ్యం.

మరి 5 గురు తమ తమ లైఫ్ లో అనుకున్నది సాధించారా… అసలు 5 గురికి లింక్ ఏంటి అన్న వివరాలు అన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎవ్వరూ తగ్గలేదు, అందరూ తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించారు. సీనియర్స్ అయిన శుభలేక సుధాకర్, ఈశ్వరి రావ్ కి ఏమాత్రం…

తీసిపోకుండా మిగిలిన వాళ్ళు కూడా నటించి మెప్పించారు, సంగీతం మెప్పించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది, ఎడిటింగ్ బాగుంది కానీ అది ఫస్టాఫ్ కే పరిమితం అయింది, సెకెండ్ ఆఫ్ నరేషన్ స్లో అవుతుంది. సినిమాటోగ్రఫీ బాగుండగా డైలాగ్స్ కూడా బాగా ఉన్నాయి.

ఇక డైరెక్షన్ పరంగా తేజ మర్ని ఎంచుకున కథ బాగున్నా అది స్ట్రాంగ్ గా చెప్పలేక పోయాడు, ఫస్టాఫ్ వరకు అంచనాలను అందుకున్నా సెకెండ్ ఆఫ్ కథ ప్రిడిక్ట్ చేసేలా ఉండటం, నరేషన్ స్లో అవ్వడం ఎమోషనల్ సీన్స్ కొంచం రిపీట్ అయినలు అనిపించినా ఓవరాల్ గా విగ్రహ రాజకీయాల గురించి ఉన్నంతలో బాగానే వివరించాడు.

ఓవరాల్ గా సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే… అందరి అద్బుత పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్, కథ మెయిన్ పాయింట్, ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే, సంగీతం లాంటివి బాగా మెప్పించాగా మైనస్ పాయింట్స్ విషయనికి వస్తే ముందే చెప్పినట్లు సెకెండ్ ఆఫ్ స్లో అవ్వడం, కథ ప్రిడిక్ట్ చేసేలా ఉండటం లాంటివి కొంచం ఎఫెక్ట్ చూపాయి.

దాంతో పాటు కథ మొత్తం విగ్రహం చుట్టూనే తిరుగుతున్నా కానీ జనాలు ఎదురుకునే కష్టాలు మరింత బాగా చూపెట్టే అవకాశం ఉన్నా అలా చేయలేదు, అలాగే ఈ 5 పాత్రల మధ్య లింక్ ని మెప్పించే విధంగా చెప్పినప్పటికీ మరింత బాగా ఎస్టాబ్లేష్ చేసే అవకాశం ఉన్నా చేయలేదు.

ఇవి చిన్న చిన్న మైనస్ పాయింట్స్… ఓవరాల్ గా కాన్సెప్ట్ బేస్ మూవీస్ ఇష్టపడే వారు, కొత్త కథలను కోరుకునే వారికి సినిమా నచ్చుతుంది, కమర్షియల్ మూవీస్ చూసే వారికి సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. మొత్తం మీద ఈజీగా ఒకసారి లీడ్ క్యారెక్టర్స్ అద్బుత నటన కోసం చూసేయోచ్చు…. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here