Home TRP రేటింగ్ 5 ఏళ్ల తర్వాత టెలికాస్ట్…2 కోట్ల రేటు…TRP రేటింగ్ తెలిస్తే షాక్!

5 ఏళ్ల తర్వాత టెలికాస్ట్…2 కోట్ల రేటు…TRP రేటింగ్ తెలిస్తే షాక్!

0

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా జెండా పై కపిరాజు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2014 రిలీజ్ అనుకుంటే లేట్ అయ్యి 2015 లో ఆడియన్స్ ముందుకు రాగా అది కూడా కాంపిటీషన్ లో వచ్చింది, అది కూడా నాని నటించిన మరో సినిమా కి పోటిగా రిలీజ్ అయింది. ఎవడె సుబ్రహ్మణ్యం కి పోటిగా వచ్చిన ఈ సినిమా పర్వాలేదు…

అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి వలన అలాగే క్రేజ్ పెద్దగా లేకపోవడం వలన అంచనాలను అందుకోలేక బిలో యావరేజ్ గా నిలిచింది. ఇక టెలివిజన్ లో సినిమా టెలికాస్ట్ అవ్వడానికి భారీ టైం పట్టడం మరింత షాకింగ్ అనే చెప్పాలి.

దాదాపు 5 ఏళ్ల తర్వాత అసలు నాని ఈ సినిమా చేశాడు అన్న విషయం కూడా జనాలు దాదాపుగా మర్చిపోయే టైం లో స్టార్ మా ఛానెల్ ఈ సినిమా ను సుమారు 2 కోట్ల రేంజ్ శాటిలైట్ రైట్స్ ని చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా రీసెంట్ గా టెలివిజన్ లో తొలిసారి టెలికాస్ట్ చేసింది.

కాగా టెలికాస్ట్ చేసిన తొలిసారి సినిమా కి 5.72 TRP రేటింగ్ దక్కింది. రీసెంట్ టైం లో లేట్ టెలికాస్ట్ డబ్బింగ్ మూవీస్ తో పోల్చితే కొంచం తక్కువ రేటింగ్ నే సినిమా సొంతం చేసుకుంది అని చెప్పాలి. అదే టైం లో అసలు ఇలాంటి సినిమా ఒకటి ఉందని కూడా తెలియని జనాలు ఉన్న టైం లో…

ఈ మాత్రం రేటింగ్ ని అయినా దక్కించుకుందీ అంటే గొప్ప విషయం అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా ఛానెల్ కొన్న రేటు ప్రకారం చూసుకుంటే పర్వాలేదు అనిపించే రిజల్ట్ నే ఈ సినిమా సొంతం చేసుకుంది, తర్వాత టెలికాస్ట్స్ తో ఛానల్ కి సినిమా ప్రాఫిట్స్ ని అందించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here