Home న్యూస్ ఇదేం ట్రైలర్ రా బాబు….తలపట్టుకుంటున్న ఆడియన్స్!!

ఇదేం ట్రైలర్ రా బాబు….తలపట్టుకుంటున్న ఆడియన్స్!!

0

మన దగ్గర అప్పుడప్పుడు వచ్చే ఓవర్ యాక్షన్ సీన్స్ ని చూసి బాలీవుడ్ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు, ఇంత సిల్లీగా వీళ్ళు సినిమాల్లో యాక్షన్ సీన్స్ ని ఎలా పెడతారు అని, కానీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు మనకు మించిపోయే రేంజ్ లో ట్రోల్ స్టఫ్ ని మనకూ ఇస్తూ ఉంటారు… బోయపాటి యాక్ష్సన్ సీన్స్ కొన్ని అప్పుడప్పుడు ట్రోల్ అవ్వడం కామన్ అవ్వగా బాలీవుడ్ లో కూడా…

ఇలాంటి ట్రోల్ స్టఫ్ ఉన్న సినిమాలు రావడం ఈ మధ్య కామన్ గా జరుగుతూ ఉంది, బాలీవుడ్ కండల దాదా జాన్ అబ్రహం సినిమాలంటే ఓవర్ యాక్షన్ సీన్స్ కచ్చితంగా ఉండి తీరాల్సిందే అన్న రూల్ పెట్టుకున్నట్లు ప్రతీ సినిమాలో యాక్షన్ సీన్స్ ఓవర్ ది టాప్ లో ఉంటాయి…

లేటెస్ట్ గా జాన్ అబ్రహం ఏకంగా ట్రిపుల్ రోల్ లో కనిపించిన సినిమా సత్యమేవ జయతే2…. నార్మల్ కంటెంట్ తోనే హిట్ అయిన సత్యమేవ జయతే సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ చూసి అక్కడ వాళ్ళే ఇదేం ట్రైలర్ రా బాబు అని తలపట్టుకు కూర్చున్నారు…

ఒక రౌడీ, ఆ రౌడీని ఆపాలని చూసే పోలిస్… వీళ్ళ ఇద్దరినీ వాడుకోవాలని చూసే విలన్స్, వీల్లిదరినీ ఏకం చేయాలనీ చూసే పొలిటికల్ లీడర్ అయిన మరో హీరో… మొత్తంగా ముగ్గురు కలిసిన తర్వాత విలన్లను చీల్చి చెందాడుతారు… కథనే ఓవర్ గా ఉందంటే ట్రైలర్ చూపెట్టిన యాక్షన్ సీన్స్ మరో లెవల్ లో ఉన్నాయి, బండిని, బండి పై ఉన్న వ్యక్తీతో సహా ఎత్తుతాడు హీరో…

ఒక్క గుద్దు గుద్దితే టేబుల్ రెండు వక్కలు అవుతుంది, ముట్టుకుంటే కొబ్బరికాయ 2 గా చీలుతుంది… కారు ని ఒక ఊపు ఊపితే డామేష్ అవుతుంది. ఇలా ట్రైలర్ మొత్తం మాస్ కంటెంట్ అంటూ క్రింజ్ సీన్స్ తో నింపేశారు… అది చూసి మన వాళ్ళే కాదు బాలీవుడ్ వాళ్ళు కూడా ఇదేం సినిమా రా బాబు అని ఇప్పుడే తలలు పట్టుకుంటున్నారు. ఇక సినిమా నవంబర్ 25న రిలీజ్ కానుందట. అప్పుడు ఇంకా ఎంత ట్రోల్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here