Home గాసిప్స్ కల్కి లో ప్రభాస్ తో 2 క్రేజీ హీరోల స్పెషల్ రోల్స్…వాళ్ళు ఎవరంటే!

కల్కి లో ప్రభాస్ తో 2 క్రేజీ హీరోల స్పెషల్ రోల్స్…వాళ్ళు ఎవరంటే!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ అయిన  కల్కి 2898AD( Kalki2898AD Movie) ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో అంచనాలు అయితే భారీగా ఉన్నాయి అని చెప్పాలి.

ఇప్పటి వరకు సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం మీద సినిమా మీద అంచనాలను అయితే ఓ రేంజ్ లో పెంచేసింది అనే చెప్పాలి. ఇక లేటెస్ట్ గా సినిమా కి సంభందించిన మరో ఆసక్తి కరమైన వార్తా ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్తల ప్రకారం సినిమాలో కొన్ని స్పెషల్ క్యామియోలు కూడా ఉండబోతున్నయట…

ఆ వార్తల ప్రకారం సినిమాలో స్పెషల్ క్యామియోలు టాలీవుడ్ నుండి యోత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటిస్తూ ఉండగా మలయాళ ఇండస్ట్రీ నుండి దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది….ఈ వార్తలు సోషల్ మీడియాలో అలాగే…

ఇండస్ట్రీ మొత్తం చక్కర్లు కొడుతూ ఉండగా ఈ ఇద్దరు హీరోలు కూడా నాగ్ అశ్విన్ తో మహానటి మూవీ చేసి ఉండటంతో వీళ్ళ స్పెషల్ క్యామియోలు సినిమాలో ఉంటాయని అంటున్నారు. ఇదే కనుక జరిగితే ఆల్ రెడీ పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ క్రేజ్ ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర ఇండస్ట్రీలలో కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here