Home న్యూస్ ఇది కదా క్వాలిటీ అంటే….కల్కి ‘అశ్వ‌త్థామ‌’ గ్లిమ్స్ అరాచకం అంతే!!

ఇది కదా క్వాలిటీ అంటే….కల్కి ‘అశ్వ‌త్థామ‌’ గ్లిమ్స్ అరాచకం అంతే!!

0

ఈ ఇయర్ లో పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సెన్సేషనల్ మూవీస్ లో  రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న మమ్మోత్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) ఒకటి…సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సమ్మర్ ఎండ్ టైంకి రిలీజ్ కి సిద్ధం కానుండగా…

సినిమాలో కీలక రోల్స్ గురించి ఒక్కోటిగా రివీల్ చేస్తున్నారు మేకర్స్…రీసెంట్ గా సినిమాల కీలక రోల్ చేస్తున్న బాలీవుడ్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) చేస్తున్న రోల్ గ్లిమ్స్ ను రివీల్ చేశారు. ఇది ఆల్ రెడీ లీక్ అయిందే అయినా సినిమాలో అమితాబ్ ద్వాప‌ర యుగంలోని ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వ‌త్థామ‌ను నేను అంటూ…

ఓ చిన్న పిల్లవాడికి చెబుతూ ఉండటం విశేషం, తను ఒక పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండగా శివ లింగం మీద నీళ్ళు పడటంతో అదే తన పిలుపుగా భావించే అశ్వ‌త్థామ‌ ఆ తర్వాత ఏం చేశాడు అన్నది తన రోల్ కాగా గ్లిమ్స్ లో యంగ్ అమితాబ్ ను చూపించిన షాట్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించాయి..

రీసెంట్ టైంలో సీనియర్ హీరోలను యంగ్ లుక్ లో చూపించడానికి ట్రై చేసినా అవి ట్రోల్ ఎక్కువగా అయ్యాయి, కానీ అమితాబ్ లుక్ మాత్రం అసలు ఎలాంటి వంక పెట్టడానికి వీలు లేకుండా ఉండటం సినిమా క్వాలిటీ ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నది ఇది చూస్తె తెలిసిపోతుంది….

సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ ప్రమోషన్ కంటెంట్ అంచనాలను ఓ రేంజ్ లో పెంచుతూ ఉండటం విశేషం, త్వరలోనే రిలీజ్ డేట్ ఆల్ మోస్ట్ కన్ఫాం కానుండగా మే ఎండ్ కోసం బయర్స్ ట్రై చేస్తున్నా మేకర్స్ జూన్ ఎండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. మరి ఏది ఫైనల్ అవుతుందో అన్నది త్వరలో క్లారిటీ వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here