Home న్యూస్ నైజాం గడ్డ మీద రెబల్ స్టార్ కెరీర్ బెస్ట్ రికార్డ్….కెరీర్ బెస్ట్ ఫామ్ సామి ఇది!

నైజాం గడ్డ మీద రెబల్ స్టార్ కెరీర్ బెస్ట్ రికార్డ్….కెరీర్ బెస్ట్ ఫామ్ సామి ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి(Baahubali) సిరీస్ తర్వాత ఆ రేంజ్ లో రచ్చ చేయని రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) తర్వాత చేసిన సినిమాల్లో ఇప్పుడు లేటెస్ట్ గా కల్కి 2898AD(Kalki2898AD Movie) సినిమాతో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు నైజాంలో మరో లెవల్ లో హోల్డ్ చేస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ఒకెత్తు అయితే నైజాం ఏరియాలో సాధించిన కలెక్షన్స్ మరో ఎత్తు అని చెప్పాలి ఇప్పుడు…మొత్తం మీద 65 కోట్ల వాల్యూ బిజినెస్ ను ఇక్కడ సొంతం చేసుకున్న కల్కి మూవీ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 80 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని దాటేసి…

ఇప్పుడు టోటల్ రన్ లో 90 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా రెబల్ స్టార్ కెరీర్ లో నైజాంలో బాక్ టు బాక్ కొత్త రికార్డ్ లు నమోదు అయ్యాయి. ఇది వరకు బాహుబలి2 మూవీ టోటల్ రన్ లో 68 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఆ కలెక్షన్స్ ప్రభాస్ లాస్ట్ ఇయర్ లో…

   

సలార్(Salaar Movie) తో బ్రేక్ చేసి కెరీర్ లో మొట్ట మొదటి సారిగా 70 కోట్ల షేర్ మార్క్ ని దాటి 71.40 కోట్ల షేర్ ని అందుకుని కెరీర్ బెస్ట్ రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు కల్కి మూవీ ఆ రికార్డ్ ను దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…

75 కోట్లు దాటేసి 80 కోట్ల మార్క్ ని అందుకుని ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. సినిమా టోటల్ రన్ 90 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని ఒక్క నైజాంలోనే అందుకునే అవకాశం ఉండగా కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ తన అప్ కమింగ్ మూవీస్ తో ఇదే రేంజ్ లో రచ్చ చేస్తే మిగిలిన హీరోలు ప్రభాస్ ని అందుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here