Home న్యూస్ కల్కి Vs RRR Vs KGF2….11 డేస్ కలెక్షన్స్ లో తోపు ఎవరంటే!

కల్కి Vs RRR Vs KGF2….11 డేస్ కలెక్షన్స్ లో తోపు ఎవరంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసింది…అన్ని చోట్లా సినిమా అనుకున్న అంచనాలను మించి వసూళ్ళని సొంతం చేసుకోగా రీసెంట్ బిగ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన…

RRR మూవీ మరియు KGF Chaptar2 లాంటి సినిమాలతో కంపేర్ చేస్తే కల్కి మూవీ ఎంతవరకు జోరు ని 11 రోజులు పూర్తి అయ్యే టైంకి చూపించింది అన్నది ఆసక్తిగా మారగా మూడు సినిమాల కలెక్షన్స్ ని గమనిస్తే…నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ….

11 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 509.48 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా వచ్చిన వెంటనే రిలీజ్ అయిన కేజిఎఫ్ చాప్టర్2 మూవీ 11 రోజులు పూర్తి అయ్యే టైంకి 445 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకుంది…

   

ఇక 11 రోజుల్లో కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 435.63 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…ఇక గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఆర్ ఆర్ ఆర్ మూవీ వరల్డ్ వైడ్ గా 920 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది…. ఇక కేజిఎఫ్ చాప్టర్2 మూవీ 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా…

900.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కల్కి మూవీ 11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 839 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది. ఓవరాల్ గా ఇతర పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ తో పోల్చితే కల్కి మంచి జోరుని చూపిస్తూ ఉండగా….మొత్తం మీద 3 సినిమాల్లో…

RRR మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ గ్రోత్ ఉండగా కేజిఎఫ్ చాప్టర్2 మూవీ హిందీలో భారీ కలెక్షన్స్ హెల్ప్ వలన లీడ్ లో ఉంది. ఇక కల్కి అన్ని చోట్లా ఈక్వల్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా లాంగ్ రన్ లో మిగిలిన 2 సినిమాలకు ఎంత దగ్గరగా వెళుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here