రీసెంట్ టైంలో వచ్చిన స్టార్స్ నటించిన సినిమాల టీసర్ లు/ట్రైలర్ లు/సాంగ్స్ కి యూట్యూబ్ లో గ్లిట్చ్ ల వల్ల మొదటి రోజు అనుకున్న రేంజ్ లో వ్యూస్ సొంతం అవ్వలేదు, కానీ రెండో రోజు మాత్రం వాటికి మొదటి రోజుకి మించి వ్యూస్ రావడం రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ అండ్ టీసర్ లకు మనం చూశాం…లేటెస్ట్ గా పాన్ ఇండియా సెన్సేషన్…
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా మొదటి 24 గంటల్లో ఈ ట్రైలర్ కి 14.43 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు గ్లిట్చ్ వలన వ్యూస్ కోసం తగ్గి ఉంటాయి ఏమో…
రెండో రోజు సెట్ అవుతాయి అనుకున్నా కూడా రెండో రోజు ట్రైలర్ కి వ్యూస్ అనుకున్న రేంజ్ లో అయితే పెరగలేదు. రెండో రోజు మొత్తం మీద యూట్యూబ్ లో 4.17 మిలియన్ వ్యూస్ ను మాత్రమే సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 32 వేల లైక్స్ మాత్రమే సొంతం అయ్యాయి..
రీసెంట్ టైం లో రిలీజ్ అయిన స్టార్స్ మూవీస్ పరంగా రెండో రోజు కొంచం తక్కువగా వ్యూస్ ను సొంతం చేసుకుంది కల్కి మూవీనే….యూట్యూబ్ పరంగా పెద్దగా జోరు చూపించ లేక పోయిన కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. తొలిరోజు రికార్డు కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.