బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ డబ్ మూవీ కాంతార ఆడియన్స్ ముందుకు వచ్చి 2 వారాలను తెలుగు లో కంప్లీట్ చేసుకోగా ఊహకందని కలెక్షన్స్ తో అల్టిమేట్ లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో వారం దీపావళి మూవీస్ కారణంగా చాలా వరకు థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చినా ఇప్పుడు మూడో వారంలో ఎంటర్ అయిన సినిమా తిరుగు లేని విధంగా భారీ థియేటర్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతుంది.
కాగా సినిమా తెలుగు లో రిలీజ్ అవ్వడం ఆల్ మోస్ట్ 305 థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా రెండో వారం థియేటర్స్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ వస్తున్నా 7వ రోజు కోల్పోయింది. తిరిగి 8వ రోజు నుండి 225 థియేటర్స్ ని సొంతం చేసుకుని అన్ని చోట్లా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించగా ఇప్పుడు దీపావళి మూవీస్ హావా ఒక వారానికే తగ్గినా ఈ సినిమా మాత్రం మూడో వారంలో ఒక్క నైజాంలో 223 థియేటర్స్ ని హోల్డ్ చేయగా సీడెడ్ లో 105 థియేటర్స్ ని హోల్డ్ చేసింది. ఇక ఆంధ్రలో మొత్తం మీద…
225 థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఈ సినిమా మూడో వారం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 555 థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇది ఆల్ మోస్ట్ ఓ కొత్త సినిమాకి దక్కే రేంజ్ థియేటర్స్ కౌంట్… అరాచకం అంటే ఇదే అనిపించే రేంజ్ లో 3వ వారంలో ఇలాంటి థియేటర్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.